NTR - Atlee : ఎన్టీఆర్ - అట్లీ.. ఓ రొమాంటిక్ కామెడీ మూవీ

NTR - Atlee :  ఎన్టీఆర్ - అట్లీ.. ఓ రొమాంటిక్ కామెడీ మూవీ
X

దేవర మూవీ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీఖాన్ విలన్. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 27న విడుదల కాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ లోనే ఉన్నాడు ఎన్టీఆర్. అయితే రీసెంట్ చెన్నై వెళ్లినప్పుడు వేదిక మీదే తన ఫేవరెట్ డైరెక్టర్ వెట్రి మారన్ ను తనతో సినిమా చేయమని అడగటం అక్కడి వారికి బాగా నచ్చింది. తర్వాత కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూస్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఆ సందర్భంగా దర్శకుడు అట్లీ గురించి చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి.

కొన్నాళ్ల క్రితం ఎన్టీఆర్ - అట్లీ కాంబినేషన్ లో సినిమా ఉండబోతోందని వార్తలు వచ్చాయి. మైత్రీ మూవీస్ వాళ్లు ఈ కాంబోను సెట్ చేశారన్నారు. బట్ అదే బ్యానర్ లోకి ప్రశాంత్ నీల్ వచ్చాడు. ఈ విషయాన్నే అక్కడి మీడియా వాళ్లు అడిగారట. నిజంగా అట్లీ.. ఎన్టీఆర్ కు ఓ రొమాంటిక్ కామెడీ కథ చెప్పాడట. ఆ కథ అతనికి బాగా నచ్చిందట కూడా. కానీ ప్రస్తుతం ఇద్దరూ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు కాబట్టే కాంబినేషన్ సెట్ కావడం లేదన్నాడు. అయితే కాస్త లేట్ అయినా.. ఖచ్చితంగా అట్లీ దర్శకత్వంలో సినిమా ఉంటుందని చెప్పడం విశేషం. కాకపోతే అది ఈ రొమాంటిక్ కామెడీ కథే అవుతుందా.. లేక ఇద్దరి ఇమేజ్ లు మారాయి కాబట్టి ఆ మేరకు కొత్త కథ వస్తుందా అనేది చూడాలి. బట్ ఈ ఇంటర్వ్యూస్ లో అక్కడి టాప్ హీరోలందరినీ పొగుడుతూ ఆయా హీరోల అభిమానులను భలే ఆకట్టుకుంటున్నాడు ఎన్టీఆర్.

Tags

Next Story