Ntr : ఆ ఊసే ఎత్తని ఎన్టీఆర్

Ntr :  ఆ ఊసే ఎత్తని ఎన్టీఆర్
X

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్లానింగ్ బావుంది. దేవర టైమ్ లో చాలామంది వద్దు అన్నారు. విమర్శలు చేశారు. గ్యారెంటీగా ఫ్లాప్ చూస్తాడు అన్నారు. బట్ అవేం పట్టించుకోలేదీ యంగ్ టైగర్. అందుకే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీ ఈ నెల 28న జపాన్ లో విడుదల కాబోతోంది. అందుకే అక్కడ ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక్కడ ప్రమోషన్స్ లో డైలాగ్స్ కూడా చెప్పరు. బట్ అక్కడ ఏకంగా వేదికపై ఎవరూ అడగకుండానే లోకల్స్ తో కలిసి డ్యాన్స్ వేసి అందరిలోనూ ఉత్సాహం నింపాడు. జపాన్ నుంచి రాగానే ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బెంగళూరులో చిత్రీకరణ జరుపుకుంటోంది. డ్రాగన్ అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ మరో స్థాయికి తీసుకువెళుతుందని చెబుతున్నారు. మరోవైపు బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 దాదాపు పూర్తయింది. వార్ 2 ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. డ్రాగన్ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ తో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సినిమా ఉంటుంది.

అయితే ఇన్ని చేస్తోన్నా ఎన్టీఆర్ మాత్రం దేవర 2 అనే ఊసు ఎత్తడం లేదు. అసలు ఉంటుందా లేదా అనేది కూడా తెలియడం లేదు. కొరటాల మాత్రం దేవరలో చూసింది నథింగ్. దేవర 2 సునామీలా ఉంటుందని ఆ మధ్య చెప్పాడు. బట్ దేవర జపాన్ ప్రమోషన్స్ లో కూడా ఆ ఊసు ఎత్తడం లేదు ఎన్టీఆర్. అంటే దేవర 2 చేయడం అతనికి ఇష్టం లేదా లేక.. ప్రస్తుతం ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ తర్వాత అతను అనుకున్నట్టుగా సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ ఎక్స్ ట్రార్డినరీ అనేలా ఉంటే చేద్దాం అనుకుంటున్నాడా అనేది తెలియదు కానీ.. దేవర 2 ఇక ఇప్పట్లో లేదు అనేది పక్కాగా ఫిక్స్ అయిపోవచ్చు అంటున్నారు సన్నిహితులు. అంటే కొరటాల ఇక మరో హీరోను వెదుక్కోవాలేమో.

Tags

Next Story