N T Rama Rao: ఎన్టీఆర్, కృష్ణకుమారి ప్రేమ, పెళ్లి, బ్రేకప్?

N T Rama Rao: ఎన్టీఆర్, కృష్ణకుమారి ప్రేమ, పెళ్లి, బ్రేకప్?
X
N T Rama Rao: ఎన్టీఆర్ ఏ పాత్ర వేసినా ఆ పాత్రకే వన్నె తెచ్చే నటన. అభినయం, ఆహార్యం, డైలాగ్ డెలివరీ ఏది చూసినా ఆయనకు ఆయనే గ్రేట్ అనిపించే అద్భుతమైన నటుడు ఎన్టీఆర్.

N T Rama Rao: ఎన్టీఆర్ ఏ పాత్ర వేసినా ఆ పాత్రకే వన్నె తెచ్చే నటన. అభినయం, ఆహార్యం, డైలాగ్ డెలివరీ ఏది చూసినా ఆయనకు ఆయనే గ్రేట్ అనిపించే అద్భుతమైన నటుడు ఎన్టీఆర్. అలాంటి నటుడిని చూడాలంటే మళ్లీ ఆయనే పుట్టాలేమో అనిపించే అంతగా ప్రేక్షకుల హృదయాల్లో ఎన్టీఆర్ ఓ చెరగని ముద్ర వేశారు.

నిజంగా రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు వంటి వారు ఎలా ఉంటారో మనకు తెలియదు. కానీ ఆయన్ని చూస్తే రాముడంటే ఇలాగే ఉంటాడేమో అని మనసులో అతడి రూపాన్నే నింపేసుకునేవారు. ప్రేక్షకులతో పాటు కధానాయకలు కూడా ఆయన్ని అభిమానించే వారు. అలాగే ఓ నటిమణితో కూడా ప్రేమలో పడినట్లు, అది పెళ్లికి దారి తీసినట్లు స్వయంగా ఆ హీరోయిన్ అక్క అయిన షావుకారు జానకి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ మొదటి భార్య బసవతారకం. వీరికి 12 మంది సంతానం. అయినా నటి కృష్ణకుమారితో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. నిజంగా వీరిద్దరికీ పెళ్లి జరిగి ఉంటే అంత శ్రేయస్కరంగా ఉండేది కాదేమో. అయితే వీళ్లిద్దరూ విడిపోయారో లేక గొడవ పడ్డారో తెలియదు కానీ ఆ పెళ్లి జరగలేదు అని షావుకారు జానకి చెప్పుకొచ్చారు.

కృష్ణకుమారి కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఒక్క ఫోన్ కాల్ వచ్చింది. దాంతో 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకుంది. తర్వాత ఆమె ఓ సీనియర్ జర్నలిస్ట్ అజయ్ మోహన్ కైఠాన్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది.

అదే సమయంలో ఓ బడా నిర్మాత ఫోన్ చేసి కైఠాన్‌తో మీ చెల్లి పెళ్లి ఆపండని అన్నారు. దానికి నేను ఆ పని చేయను అని కరాఖండిగా చెప్పాను. అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు షావుకారు జానకి.

Next Story