'అట్లీ' డైరెక్షన్‌లో 'ఎన్టీఆర్‌'కు హిట్ ఇస్తా: సీనియర్ ప్రొడ్యూసర్

అట్లీ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌కు హిట్ ఇస్తా: సీనియర్ ప్రొడ్యూసర్
టాప్ స్టార్స్‌తో పనిచేయాలని ప్రతి ప్రొడ్యూసర్ అనుకుంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు.

టాప్ స్టార్స్‌తో పనిచేయాలని ప్రతి ప్రొడ్యూసర్ అనుకుంటారు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. బట్.. సీనియర్ ఎన్టీఆర్ పై అభిమానంతో పరిశ్రమకు వచ్చి నిర్మాతగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్న అశ్వనీదత్‌కు ఓ కోరిక మిగిలిపోయింది. అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఓ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని. తన ప్రొడక్షన్ లో ఎన్టీఆర్ ఆల్రెడీ మూడు సినిమాలు చేశాడు. అశ్వనీదత్‌కు ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం. అందుకే ఎన్టీఆర్‌తో రెండో సినిమా నిర్మించాడు. స్టూడెంట్ నెంబర్ వన్ అంటూ వచ్చిన ఆ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ అతడికి వరుస హిట్లందించాయి. దాంతో టాప్ స్టార్‌గా ఎదిగిపోయాడు ఎన్టీఆర్. అటుపై మళ్లీ అశ్వనీదత్‌తో సినిమా చేయడానికి చాలా సమయం పట్టింది. ఆయన ప్రొడక్షన్‌లో వచ్చిన మరో రెండు చిత్రాలు కంత్రి, శక్తి. కంత్రి కాస్త ఫర్వాలేదనిపించినా.. శక్తి డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఎన్టీఆర్‌కు మరో భారీ హిట్ ఇవ్వాలనుకున్న అశ్వనీదత్ కల కలగానే మిగిలిపోయింది. ఆ కలను ఖచ్చితంగా నెరవేర్చేందుకే ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి తమిళ్ టాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నఅట్లీకి అడ్వాన్స్ ఇచ్చారట.

ఎన్టీఆర్ - అట్లీ కాంబినేషన్‌లో అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తారట. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం 'రౌద్రం రణం రుధిరం' తర్వాత కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో సినిమాలు చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి కావడానికి మరో ఏడాది పడుతుంది. అంటే 2022 వరకు అశ్వనీదత్ ఆగాల్సి ఉంటుది. అటు అట్లీ కూడా బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్‌తో ఓ మూవీకి కమిట్ అయ్యాడు. అతడు ఆ చిత్రాన్ని పూర్తి చేయడానికి కూడా దాదాపు అంతే టైమ్ పడుతుంది. అంటే అన్నీ అనుకున్నట్లు కుదిరితే.. 2022లో అశ్వనీదత్ బ్యానర్‌లో ఎన్టీఆర్ - అట్లీ కాంబోలో సినిమా ఉంటుంది. మరి ఈ మూవీతో అశ్వనీదత్ ఎన్టీఆర్‌కు హిట్ ఇవ్వాలనే కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.

YJ Rambabu

TV5 Entertainment Editor

Tags

Read MoreRead Less
Next Story