NTR - Neel : ఎన్టీఆర్ - నీల్.. ఓ పవర్ ఫుల్ టైటిల్
యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరతో బ్లాక్ బస్టర్ అందుకుని రెట్టించిన ఉత్సాంతో ‘వార్ 2’ లోకి దిగాడు. ఈ మూవీతో తను బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి అద్బుతమైన యాక్షన్ స్టంట్స్ తో పాటు డ్యాన్సులు కూడా వేయబోతున్నాడు. దీంతో పాటు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తోన్న ప్రశాంత్ నీల్ మూవీ కూడా స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు ప్రశాంత్. డిసెంబర్ రెండో వారం నుంచి ఎన్టీఆర్ కూడా సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు అంటున్నారు. హీరోయిన్ గా లేటెస్ట్ కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ ను తీసుకోబోతున్నారు అనే ప్రచారం ఉంది. ఇంకా అఫీషియల్ గా కన్ఫార్మ్ కాలేదు.
ఎన్టీఆర్ - నీల్ చిత్రానికి ఓ పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ కాంబోలో మూవీ అనౌన్స్ అయినప్పుడు అంతా ‘ట్రాన్స్ ఫార్మర్’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తారు అనుకున్నారు. బట్ తాజాగా ‘డ్రాగన్’అనే టైటిల్ వినిపిస్తోంది. ఈ టైటిల్ ను సంక్రాంతికి ప్రకటించాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారట. దీంతో పాటు ఓ చిన్న వీడియో గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. డ్రాగన్ అనేది నిజంగా పవర్ ఫుల్ టైటిల్. ఆ టైటిల్ తో ఎన్టీఆర్ నీల్ చేసే వెండితెర అరాచకం ఎలా ఉంటుందో మరి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com