Anil Ravipudi with NTR : అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ .. డబుల్ యాక్షన్..!

Anil Ravipudi with NTR : RRR మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి లను ఇంటర్వ్యూ చేశారు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్, అనిల్‌ల మధ్య కామెడీ, పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. వీరిద్దరి కాంబోలో మూవీ పడితే ఎలా ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులు అనుకున్నారు. అయితే తాజాగా ఈ కాంబినేషన్ ఓకే అయిందని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. అనిల్ దగ్గర ఓ మంచి కథ ఉందని ఎన్టీఆర్‌కి దిల్ రాజు చెప్పడంతో అది విన్న ఎన్టీఆర్ సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చెప్పాడట. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నట్టు సమాచారం. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
ఒకవేళ ఇదే నిజమైతే నందమూరి హీరోలందరితో అనిల్ రావిపూడి సినిమా చేసినట్లే అవుతోంది. కళ్యాణ్‌రామ్ 'పటాస్' మూవీ చేసి దర్శకుడిగా మారిన అనిల్.. ప్రస్తుతం 'ఎఫ్3' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.. ఆ తర్వాత బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే మూవీ డబుల్ యాక్షన్ అని తెలుస్తోంది.
అనిల్ స్టైల్‌లో కామెడీ ఉంటూనే ఎన్టీఆర్ రేంజ్‌కి ఏ మాత్రం తీసిపోని మాస్ యాంగిల్ కూడా ఉంటుందని తెలుస్తోంది. కాగా RRR మూవీని ఫినిష్ చేసిన ఎన్టీఆర్... కొరటాలతో ఓ మూవీ చేస్తున్నాడు... ఏప్రిల్‌లో మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ తర్వాత బుచ్చిబాబు సానా మూవీని లైన్‌లో పెట్టాడు ఎన్టీఆర్. ఈ రెండు సినిమాలను ఒకేసారి టేకప్ చేసి అ తర్వాత అనిల్ సినిమాని పట్టాలేక్కించే పనిలో ఉన్నాడట ఎన్టీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com