ఎన్టీఆర్ హీరోయిన్ మీకు గుర్తుందా..? ఏ సినిమాలో నటించిందో తెలుసా..?

ఎన్టీఆర్ హీరోయిన్ మీకు గుర్తుందా..? ఏ సినిమాలో నటించిందో తెలుసా..?
Tollywood Heroine: ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఈ ముద్దుగుమ్మ జూ. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిచింది.

Tollywood: ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఈ ముద్దుగుమ్మ జూ. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిచింది. ఏదో మూవీలో చూసినట్లుగా అనిపిస్తుందా..? ఈ నటి పేరు రవీనా రాజ్ పుత్.. ఎన్టీఆర్ కథానాయకుడిగా దర్శకుడు వి.ఆర్ ప్రతాప్ కాంబినేషన్ లో తెరకెక్కిన "నిన్ను చూడాలని" సినిమాలో నటించింది. రవీనా రాజ్ పుత్ "నిన్ను చూడాలని" చిత్రంలో నటించిన తర్వాత ఎక్కడా కనిపించలేదు. రవీనా అంతకుముందు కె.రాఘవేంద్ర రావు- విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కిన "ఒంటరి పోరాటం" చిత్రంలో తళుక్కున మెరిసింది.

2001లో నిన్ను చూడాలని సినిమా ప్లాప్ తర్వాత ఈ భామ మరోసారి తెరపై కనిపించలేదు. రవీనా మరే ఇండస్ట్రీలోనూ కనిపించినట్లు సమాచారం లేదు. అయితే తొలి సినిమా ప్లాప్ కావడంతో రవీనా నిరాశకు లోనైందని. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు టాక్. కొంత కాలం తర్వాత ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుని సెటిల్ అయిందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు.ఇటీవలే నెటిజన్లు రవీనా గురించి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.

ఎన్టీఆర్ హీరోగా పరిచయమైన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఎన్టీఆర్ కి ఆదిలోనే ఫ్లాప్ ఎదురైనా కుంగిపోలేదు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంలో సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు. అనతికాలంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగాడు.


Tags

Read MoreRead Less
Next Story