NTR : ఎన్టీఆర్ పై ఫ్యాన్స్ ఆగ్రహం.. రియాక్ట్ అయిన ఆఫీస్

NTR :  ఎన్టీఆర్ పై ఫ్యాన్స్ ఆగ్రహం.. రియాక్ట్ అయిన ఆఫీస్
X

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు ఆయన మమ్మల్ని కలవడం లేదు అంటూ మాట్లాడుతున్నారు. అరవింద సమేత టైమ్ లో మాత్రమే మాకు టైమ్ ఇచ్చారు. ఆ తర్వాత నుంచి అస్సలు పట్టించుకోవడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర హీరోలతో పోలిస్తే కొన్నాళ్లుగా ఫ్యాన్స్ కు తక్కువ టచ్ లో ఉంటున్నాడు అంటూ నిష్టూరాలాడుతూ వీడియోస్ పెడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఆయన్ని కలవడానికి పాదయాత్రలు చేస్తాం అంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ అభిమానులతో ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ కు ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ కు సంబంధించిన విషయం గురించి చెబుతూ ఫ్యాన్స్ కు ఓ స్పెషల్ రిక్వెస్ట్ కూడా పెట్టాడు యంగ్ టైగర్. ఈ మేరకు ఆ రిక్వెస్ట్ ను తన ఆఫీస్ నుంచి విడుదల చేయించాడు. మరి ఆ లెటర్ లో ఏముందీ అంటే..

‘‘తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో, అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని ఆయన మరోసారి స్పష్టం చేస్తున్నారు’’. అంటూ మిస్టర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఈ ఉత్తరం విడుదల చేశారు. సో.. ఫ్యాన్స్ ఈ మేరకు ఆగుతారా లేక ఇంకా ముందుకు వెళతారా అనేది చూద్దాం.

Tags

Next Story