NTR on the set of Kantara : కాంతార సెట్ లో ఎన్టీఆర్
చిన్న సినిమాగా వచ్చిన కాంతార దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. డివోషనల్ టచ్ తో సాగుతూ.. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అయిన ఈ స్టోరీ దేశంలోని అన్ని ప్రాంతాలకూ కనెక్ట్ అయింది. అందుకే కేవలం 20 కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన కాంతార ఏకంగా 400 కోట్ల వరకూ వసూళ్లు సాధించింది. అందుకే ఈ మూవీకి ప్రీక్వెల్ తీస్తున్నాడు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ లోనే రూపొందుతోన్న ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. కాంతారకు అతని సంగీతం ఓ హైలెట్ గా నిలిచింది.
ఇక కాంతార ది లెజెండ్ - చాప్టర్ 1 అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీలో బెంగాలీ నటుడు జిషుసేన్ గుప్తా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మిగతా తారాగణాన్ని ఇప్పటి వరకూ ప్రకటించకపోవడం విశేషం. కాంతార సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి 100 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది బ్యానర్. అందుకే భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడు రిషబ్ శెట్టి.
ఈ మూవీ కోసం కర్ణాటకలోని ఉడిపి ప్రాంతంలో ఉన్న కుందాపురలో ఓ భారీ సెట్ వేశారట. కన్నడ సినిమా హిస్టరీలోనే ఇంత పెద్ద సెట్ లేదు అంటున్నారు కొంతమంది. మరికొందైతే రామోజీ ఫిల్మ్ సిటీ రేంజ్ లో నిర్మించారు అంటున్నారు. అఫ్ కోర్స్ వాళ్లెవరూ రామోజీ ఫిల్మ్ సిటీ చూసి ఉండరు.. అందుకే అలా అని ఉంటారు కానీ.. వారి ఉద్దేశ్యం మాత్రం అంత పెద్దది అని అర్థం చేసుకోవాలి. రీసెంట్ గా ఎన్టీఆర్ తన తల్లి మొక్కు కోసం అంటూ ఆమె సొంత ఊరైన కుందాపురకు వెళ్లాడు కదా. అప్పుడే రిషబ్ శెట్టి ఈ సెట్ లోకి ఎన్టీఆర్ ను కూడా తీసుకువెళ్లి చూపించాడట. వీరితో పాటు ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడని ఆ ఫోటోస్ చూశాం కదా. రిషబ్ కు ఎన్టీఆర్ అంటే అభిమానం. అందుకే తను డైరెక్ట్ చేస్తూ హీరోగా నటిస్తోన్న మూవీ కోసం వేసిన భారీ సెట్ ను చూసేందుకు తారక్ ను తీసుకువెళ్లాడట. మొత్తంగా ప్రస్తుతం ఈ సెట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ద శాండల్ వుడ్ గా మారడం విశేషం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com