RRR: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల షాకింగ్ రెమ్యునరేషన్..!

RRR:బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి నుంచి వస్తోన్న మరో పాన్ ఇండియా మూవీ 'రౌద్రం..రణం..రుధిరం' (ఆర్‌ఆర్‌ఆర్).. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటించారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మించగా కీరవాణి సంగీతం అందించారు. వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా విడుదలవుతోంది. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తోన్న మూవీ కావడం, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండడంతో సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
ఇదిలావుండగా ఈ సినిమాకి ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వస్తోన్న కథనాల ప్రకారం వీరిద్దరూ ఈ సినిమా కోసం ఏకంగా రూ.45 కోట్ల అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక దర్శకుడు రాజమౌళి లాభాల్లో 30 శాతం వాటా తీసుకుంటున్నారని తెలుస్తోంది. చూస్తుంటే బడ్జెట్ లో సగం రెమ్యునరేషన్ లకి కేటాయించినట్టుగా అనిపిస్తోంది.
కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలియా భట్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ సినిమాకి మంచి క్రేజ్ ని తీసుకొచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com