Devara NTR : సినిమా కోసం తమిళ్ డైరెక్టర్ ను బతిమాలుకుంటున్న ఎన్టీఆర్

Devara NTR :   సినిమా కోసం తమిళ్ డైరెక్టర్ ను బతిమాలుకుంటున్న ఎన్టీఆర్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర ప్రమోషన్స్ తో అదరగొడుతున్నారు. ఎన్టీఆర్ ఏ స్టేట్ కు వెళ్లినా ఆ స్టేట్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటాడు కదా.. ఆ రకంగానూ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఆర్ఆర్ఆర్ టైమ్ లోనే అతని భాషా ప్రావీణ్యం గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడు కూడా దేవర కోసం ఒక్క మళయాలంలో తప్ప అన్ని భాషల్లోనూ తనే డబ్బింగ్ చెప్పాడు. ప్రస్తుతం చెన్నైలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ మాట్లాడుతున్నప్పుడు యాంకర్ ఎప్పట్లానే తమిళ్ లో స్ట్రెయిట్ మూవీ చేయొచ్చు కదా అని ముద్దు ముద్దుగా అడిగింది. దానికి నేను రెడీగానే ఉన్నాను. నా ఫేవరెట్ తమిళ్ డైరెక్టర్ ఓకే అంటే అప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్ తమిళ్ మూవీ చేస్తా అన్నాడు. దానికి ఆ యాంకరమ్మ.. మీ ఫేవరెట్ తమిళ్ డైరెక్టర్ ఎవరూ అంటే..'' ఇంకెవరూ వెట్రి మారన్ గారు.. సార్ వెట్రి మారన్ సార్ నాతో ఒక డైరెక్ట్ తమిళ్ మూవీ చేయండి సార్..దాన్ని తెలుగులో డబ్ చేసుకుంటాను.." అని వేదిక మీదే రిక్వెస్ట్ చేశాడు ఎన్టీఆర్. చూడ్డానికి ఇది అక్కడి వారికి బాగా నచ్చింది కూడా. ఆ రకంగా తమిళోల్ల మనసు దోచే ప్రయత్నం చేశాడు దేవర.

చాలాకాలం క్రితమే వెట్రిమారన్ తన ఫేవరెట్ డైరెక్టర్ అని అతనితో ఒక్క సినిమా అయినా చేయాలని ఉందని చెప్పాడు ఎన్టీఆర్. అఫ్ కోర్స్ ఈ మాట చాలాసార్లు అన్నాడనుకోండి.. కాకపోతే వెట్రి మారన్ కు తెలుగు హీరోలతో సినిమా చేసే ఉద్దేశ్యం ఉందో లేదో.. ఏదేమైనా తన ఫేవరెట్ డైరెక్టర్ ను అలా వేదిక మీదే సినిమా చేయమని అడగడం అక్కడి ఆడియన్స్ కు నచ్చిందేమో కానీ మనవాళ్లు ఫీలవుతారేమో.. ఇంత పెద్ద స్టార్ అయి ఉండి.. ఇండియాస్ టాప్ డైరెక్టర్ రాజమౌళికే మోస్ట్ ఫేవరెట్ హీరో అయి ఉండీ అలా అడగడంమన వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది ఇక్కడి ట్రోలింగ్ రాయుళ్లు రెచ్చిపోయేదాన్ని బట్టి ఉంటుందన్నమాట.

Tags

Next Story