NTR Devara : జపాన్ లో రిలీజ్ కాబోతోన్న దేవర

NTR Devara :   జపాన్ లో రిలీజ్ కాబోతోన్న దేవర
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లాస్ట్ మూవీ దేవర ప్యాన్ ఇండియా మూవీగా సూపర్ హిట్ సాధించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత విడుదల కావడంతో ఆ మూవీతో వచ్చిన క్రేజ్ ను దేవర కంటిన్యూ చేసింది. అలాగే రాజమౌళితో మూవీ చేస్తే తర్వాతి సినిమా ఫట్ అనే సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసింది దేవర. కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీతో జాన్వీ కపూర్ సౌత్ స్క్రీన్ కు పరిచయమైంది. రిలీజ్ కు ముందు అనేక అనుమానాలున్నా.. అన్నిటినీ బద్ధలు కొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రాన్ని ఇప్పుడు జపాన్ లో కూడా విడుదల చేయబోతున్నారు.

ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కు జపాన్ లో కూడా తిరుగులేని ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అఫ్ కోర్స్ రామ్ చరణ్ కూ ఉన్నారు. అంతకు ముందే ప్రభాస్ అక్కడ జెండా పాతి ఉన్నాడు. అతని కల్కి కూడా జపాన్ లో రిలీజ్ అయింది. ఇప్పుడు దేవర వంతు. తాజాగా జపాన్ రిలీజ్ కోసం ఈ దేవర ప్రమోషన్స్ చేశాడు ఎన్టీఆర్. అక్కడి మీడియాతో జూమ్ లో మాట్లాడాడు. ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జపాన్ లో ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయబోతున్నారు. మార్చి 22న ఎన్టీఆర్ జపాన్ కు వెళ్లబోతున్నాడు. ఈ లోగా జూమ్ లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు ఎన్టీఆర్. మరి దేవరతో ఎన్టీఆర్ కు జపాన్ లో ఎలాంటి రిసెప్షన్ వస్తుందో చూడాలి.

Tags

Next Story