NTR : వార్ 2 నుంచి కొత్త పోస్టర్.. అద్దిరిపోయిన ఎన్టీఆర్ లుక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 ట్రైలర్ వరల్డ్ వైడ్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ను ట్రోల్ చేసిన వారంతా నోరు మూసుకునేలా ఉంది అనే టాక్ కూడా వచ్చింది. యాక్షన్ తో బాలీవుడ్ ను కూడా మెప్పించబోతున్నాడు అనేది అర్థం అయింది. అయితే ఈ మూవీ నుంచి తాజాగా మరో పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. ఓ చేతిలో హ్యామర్(సుత్తి) మరో చేతిలో చైన్ పట్టుకుని ఆల్ట్రా స్టైలిష్ గా అదే టైమ్ వీరమాస్ గా ఉందా లుక్.
ఇప్పటి వరకూ వార్ 2 నుంచి వచ్చిన అన్ని లుక్స్ కు భిన్నంగా ఉంది ఈ పోస్టర్. స్టైలిష్ గా కనిపిస్తూనే మాస్, యాక్షన్ తో అదరగొట్టబోతున్నాడు అని ట్రైలర్ చూపిస్తే.. ఈ లుక్ హృతిక్ ను కూడా డామినేట్ చేయబోతున్నాడు అనేలా ఉంది. ఆగస్ట్ 14న విడుదల కాబోతోన్న వార్ 2 తో ఓ కొత్త ఎన్టీఆర్ ను చూడబోతున్నాం అనేది ట్రైలర్ తోనే అర్థం అయింది. ఆ హైప్ ను ఇలాంటి పోస్టర్స్ ఇంకా పెంచుతున్నాయని చెప్పొచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com