NTR watch : ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ధరెంతో తెలుసా?

NTR watch : అభిమాన హీరోలు ఏం చేసిన సరే ఫ్యాన్స్‌కి అది క్రేజీగానే ఉంటుంది.. ఇప్పుడు ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరిగింది.. ఇటీవల RRR సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్ ధరించిన వాచ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. ఇంతకీ ఎన్టీఆర్ ధరించిన ఆ వాచ్ పేరు ఏంటంటే.. Patek Philippe Nautilus 5712 1/A.. ఇంగ్లాండ్‌కి చెందిన ఈ బ్రాండ్ ధర రూ. కోటి 70 లక్షల పైనే.
రిచ్ వాచ్ లను ఎన్టీఆర్ ధరించడం కొత్తేమి కాదు.. గతంలో కూడా ఎన్టీఆర్ రిచర్డ్ మిల్లే RM కు చెందిన 011 కార్బన్ NTPT గ్రోస్జీన్ వాచ్ ధరించాడు. దీని ధర రూ. 4 కోట్లు ఉంటుంది. ఇలాంటివి ఎన్టీఆర్ దగ్గర మరో రెండు వాచ్‌లు ఉన్నాయని సమాచారం. ఎన్టీఆర్‌కి కార్లు, వాచ్, డ్రెస్‌లు అంటే చాలా ఇష్టమట... నచ్చితే ధరెంతైన పెట్టేస్తాడట.
ఇక RRR సినిమా విషయానికి వచ్చేసరికి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించి మెప్పించారు. కీరవాణి సంగీతం అందించగా, విజయేంద్రప్రసాద్ కథని అందించారు. మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com