NTR 31 : ఎన్టీఆర్ దూకుడు పెంచుతున్నాడు

NTR 31 :  ఎన్టీఆర్ దూకుడు పెంచుతున్నాడు
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారాడు. ఆ మాస్ తో పాటు క్లాస్ ను కూడా కవర్ చేస్తూ ఎంచుకునే కథల్లో ఓ వైవిధ్యం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. దేవరతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టాడు. ఈ మూవీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 మూవీ చేస్తున్నాడు. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తోన్న ఈ మూవీతో ఆయన బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ముందు నుంచీ చెబుతున్నారు. ఇలా ఏజెంట్ తరహా పాత్ర చేయడం అతనికీ ఫస్ట్ టైమ్. వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ గతంలోనే అఫీషియల్ గా అనౌన్స్ అయింది.

ఎన్టీఆర్ - నీల్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ కంటే ముందే రావాల్సి ఉంది. బట్ లేట్ అయింది. ఈ లోగా దేవర కూడా వచ్చేసింది. బట్ లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు ఈ కాంబోలో ట్రాన్స్ ఫార్మర్ లాంటి హైలీ ఇన్ ఫ్లామబుల్ లాంటి మూవీ వస్తోందంటున్నారు. ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ గా ‘డ్రాగన్’ అంటున్నారు. సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోతోంది. ఇక ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఓ క్రేజీ అప్డేట్ హల్చల్ చేస్తోంది. డ్రాగన్ రెగ్యులర్ షూటింగ్ ఈ సంక్రాంతి తర్వాత నుంచే స్టార్ట్ కాబోతోంది. ఈ ఫస్ట్ షెడ్యూల్ లోనే ఎన్టీఆర్ కూడా జాయిన్ కాబోతున్నాడు. తర్వాత ఫిబ్రవరి చివరి వారం నుంచి జరిగే షెడ్యూల్ లో కూడా జాయిన్ అవుతాడట.

నిజానికి ఈ ప్రాజెక్ట్ లోకి ఎన్టీఆర్ వేసవి నుంచి జాయిన్ అవుతాడు అనుకున్నారు. కానీ డ్రాగన్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ మెంట్ టైమ్ లోనే చెప్పారు. 2026 జనవరి 9న రిలీజ్ చేస్తాం అన్నారు. అందుకే ఎక్కువ లేట్ చేసినా మంచి సీజన్ మిస్ అవుతుంది. అందుకే ఎన్టీఆర్ దూకుడు పెంచాడు. డ్రాగన్ తర్వాత మళ్లీ కొరటాల శివతో దేవర 2 ఉండే అవకాశం ఉంది.

Tags

Next Story