NTR : జైలర్ డైరెక్టర్ తో ఎన్టీఆర్

తెలుగులో మరో క్రేజీ కాంబినేషన్ కు సంబంధించి రూమర్స్ ఊపందుకున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మూవీ అంటే ప్యాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వచ్చినట్టే ఇప్పుడు. దేవరతో తను సోలోగానే ప్రూవ్ చేసుకున్నాడు. వార్ 2 తో అతను మరో స్థాయికి వెళ్లబోతున్నాడు అనేది నిజం అంటోంది బాలీవుడ్. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమా కూడా స్టార్ట్ అయింది. ఈ మూవీలో ఎన్టీఆర్ ను ముందెన్నడూ చూడని రేంజ్ లో చూపించబోతున్నాడు ప్రశాంత్ అనేది అందరూ చెప్పుకుంటోన్న మాట. అదీ కాక ప్రశాంత్ తన బ్లాక్ అండ్ గ్రే షేడ్ స్క్రీన్ టోన్ ను కూడా ఈ మూవీతో మార్చబోతున్నాడట. అది ఇప్పటికే చాలామందికి బోర్ అనిపించింది కాబట్టి ఇది ఫ్రెష్ గా కనిపిస్తుంది. అదే టైమ్ లో దేవర 2 కూడా ఉంటుంది. అయితే దేవర 2 కు సంబంధించి ఇప్పటి వరకూ సరైన క్లారిటీ లేదు. ఎప్పుడు ఉంటుంది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అందుకే అతను తమిళ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కు ఛాన్స్ ఇచ్చాడనే న్యూస్ కోలీవుడ్, టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
నెల్సన్ రీసెంట్ గా రజినీకాంత్ తో చేసిన జైలర్ బాక్సాఫీస్ ను ఊచ కోత కోసింది. ప్రస్తుతం ఆ మూవీకే సీక్వెల్ పనులు మొదలుపెట్టాడు అతను. ఇటు ఎన్టీఆర్ ప్రస్తుతం వార్2 మూవీ షూటింగ్ లో ఉన్నాడు. ఇది పూర్తయిన తర్వాతే ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ లోకి అడుగుపెడతాడు. ఈ మూవీకి కొత్త మేకోవర్ కావాలిట. అందుకే టైమ్ పడుతుంది. ఆ లోగా నెల్సన్ కూడా జైలర్2 పూర్తి చేస్తాడు.
సో.. అన్నీ కుదిరితే ఈ కాంబోలో సినిమా 2027లో ప్రారంభం అవుతుంది. బట్ ఇప్పటి వరకైతే ఈ కాంబినేషన్ కు సంబంధించిన అఫీషియల్ న్యూస్ లేదు. జస్ట్ హీరో, దర్శకుడు మధ్య చర్చలు నడుస్తున్నాయట అంతే. ఒకవేళ సెట్ అయితే ఇది ఎన్టీఆర్ కు 33వ సినిమా అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com