Jr. Ntr : ఆర్ఆర్ఆర్ చూసి తెలుగు నేర్చుకున్న జపాన్ ఫ్యాన్

Jr. Ntr :  ఆర్ఆర్ఆర్ చూసి తెలుగు నేర్చుకున్న జపాన్ ఫ్యాన్
X

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఓ అరుదైన వీడియోను నెటిజన్స్ తో పంచుకున్నారు. కొన్ని రోజుల క్రితం జపాన్ లో దేవర ప్రమోషన్స్ కోసం వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సందర్భంగా ‘నా జపాన్ పర్యటన అనేక జ్ఞాపకాలను ఇచ్చింది. కానీ ఇది మాత్రం నిజంగా నా హృదయాన్ని వైవిధ్యంగా తాకింది. ఒక జపనీస్ తను ఆర్ఆర్ఆర్ మూవీ చూసి తెలుగు నేర్చకున్నా అని చెప్పడం నన్ను కదిలించింది. సినిమా, భాషల ప్రేమికుడిగా, సంస్కృతుల మధ్య వారధిగా ఉండే సినిమా శక్తి.. అభిమానిని భాష నేర్చుకోవడానికి ప్రోత్సహించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు ఇండియన్ సినిమాను సెలబ్రేట్ చేసుకోవడం మరో కారణం’ అంటూ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

అభిమానులంతా ఎన్టీఆర్ తో ఆటోగ్రాఫ్స్ తీసుకుంటున్నప్పుడు నిజంగా ఆ అమ్మాయి తెలుగులోనే ‘అన్నా అన్నా.. నేను ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను. నేను మీతో మాట్లాడాలి. నేను రెండు సంవత్సరాల ముందు ఈ పుస్తకం ఈ పుస్తకం అంటూ ’ కాస్త తడబడుతున్నా.. తెలుగు అక్షరమాల ఉన్న పుస్తకాన్ని చూపించి అందులో ఆటోగ్రాఫ్ తీసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

Tags

Next Story