NTR's brother-in-law : ఎన్టీఆర్ బావమరిది ఆరంభం బావుంది.. కానీ..

హీరోల కొడుకులు హీరోలుగా వస్తే ఆదరణ వారి ఇతర బంధుత్వాలు వస్తే పెద్దగా కనిపించదు. ఆ హీరోల నుంచి కూడా ఆ స్థాయి సపోర్ట్ ఉండదు. దీంతో ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకుంటారు. ఎన్టీఆర్ బావమరిది విషయంలోనూ ఇలాగే అనిపించింది. కాకపోతే ఎన్టీఆర్ బ్యాక్ ఎండ్ లో ఏమైనా హెల్ప్ చేశాడేమో చెప్పలేం కానీ.. అతను ఇప్పటి వరకూ తన బావమరిది నార్నే నితిన్ కోసం ఏ సినిమా ఫంక్షన్ కూ రాలేదు. అతన్ని సపోర్ట్ చేయమని ఫ్యాన్స్ కు చెప్పలేదు. బట్ ఈ కుర్రాడు రెండు సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ మూవీ మ్యాడ్ లో నలుగురులో ఒకడుగా ఉన్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ట్రాక్ ఉన్నా.. ఎక్కువగా ఇతర కుర్రాళ్లే హవా చేశారు. బట్ డెబ్యూ మూవీ హిట్ అంటే కెరీర్ కు ప్లస్ అవుతుంది కదా.
రీసెంట్ గా వచ్చిన 'ఆయ్' పెద్ద విజయం సాధించిందనే చెప్పాలి. ఈ మూవీ బడ్జెట్ తో పోలిస్తే వచ్చిన రెవిన్యూను బట్టి ఇది పెద్ద విజయమే. అఫ్ కోర్స్ ఈ మూవీకి బ్యాక్ ఎండ్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ ఉండటం ప్లస్ అయింది. అందుకే అంత పెద్ద పోటీలో వచ్చినా తనే విజేతగా నిలిచాడు. అయితే ఈ విజయాలు అతనికి చాలా బూస్టప్ ఇచ్చి ఉండాలి. మరి ఇది సరిపోతుందా అంటే ఖచ్చితంగా లేదు అనే చెప్పాలి.
మ్యాడ్ మూవీలో నలుగురులో ఒకడుగా ఉన్నాడు. ఆయ్ లోనూ అతనికి బలమైన సపోర్టింగ్ కాస్టింగ్ ఉంది. ఓ రకంగా కొన్నాళ్ల పాటు నితిన్ ఈ తరహా సేఫ్ జర్నీ చేస్తేనే బెటర్. ఎందుకంటే అతనిది కమర్షియల్ హీరో కటౌట్ కాదు. సోలోగా కథను మొత్తం మోయడానికి ఇంకా చాలా టైమ్ పట్టేలా ఉంది. అందుకే.. తనతో పాటు కొంత కాలం కాస్త బలమైన కాస్టింగ్ కూడా ఉండేలా చూసుకుంటే చాలా బెటర్. తనకంటూ ఓ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత.. ప్రేక్షకుల్లోనూ అతనిపై నమ్మకం కలగాలంటే ఈ తరహా సినిమాల్లో బలమైన నటన చూపించగలగాలి. అప్పుడు సోలోగా కథలు మోయడానికి అతను సిద్ధమైతే ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇండస్ట్రీలో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. వెండితెరపై ఉన్నప్పుడు ప్రేక్షకుల చేత మెప్పు పొందితేనే ఇక్కడ నిలబడతారు. బ్యాక్ ఎండ్ వల్ల కాదు. సో.. ఈ విషయంలో నార్నే నితిన్ అప్పుడే కమర్షియల్ హీరోగా సత్తా చాటాలనే గొప్పలకు పోకుండా మ్యాడ్, ఆయ్ లాగా తనతో పాటు కథను ముందుకు తీసుకువెళ్లే సపోర్టింగ్ కాస్టింగ్ కూడా ఉండేలా చూసుకుంటే ఖచ్చితంగా కొన్నాళ్ల పాటు కెరీర్ సాఫీగా నడిపించేయొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com