సైమా అవార్డ్స్ ఫంక్షన్లో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..

రాజమౌళీ దర్శకత్వం వహించిన "RRR"లో తన పాత్రతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఎన్టీఆర్ SIIMA ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ఆస్కార్‌లో ఎన్టీఆర్‌కి బెస్ట్ యాక్టర్ వస్తుందని చాలా మంది ఊహించారు కానీ అది జరగలేదు.
గత రాత్రి దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ప్రతిష్టాత్మక సైమా అవార్డు ప్రదానోత్సవం జరిగింది. ఎన్టీఆర్ కి అవార్డు వస్తుందని మొదటి నుంచి అందరూ ఊహించి, అనుకున్నట్లుగానే జ్యూరీ అతడిని ఎంపిక చేసింది.
అవార్డును స్వీకరించిన అనంతరం ఎన్టీఆర్ తన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. “నా అభిమానులందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. నా అభిమానులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను తడబడినప్పుడల్లా నన్ను పైకి లేపడానికి, నా కళ్లలో పడిన ప్రతి కన్నీటిని తుడిచి, నా చిరునవ్వుల ఆనందంలో పాలుపంచుకోవడానికి మీరంతా ఉన్నారు. నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులందరికీ, మీ తిరుగులేని అభిమానానికి ధన్యవాదాలు అని తారక్ అభిమానుల చప్పట్ల మధ్య ప్రసంగించారు. అద్భుతమైన ప్రసంగంతో అభిమానుల హృదయాలను దోచుకున్నారు.
కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ డ్రామా "దేవర"లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ ఈ చిత్రంలో భాగం కానున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com