నువ్వేకావాలి హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందంటే..? లేటెస్ట్ ఫోటోస్

నువ్వేకావాలి హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందంటే..? లేటెస్ట్ ఫోటోస్
Richa Pallod: రిచా పల్లాడ్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. నువ్వేకావాలి మూవీ హీరోయిన్ అనగానే టక్కున గుర్తుపడతారు.

Richa Pallod: రిచా పల్లాడ్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. నువ్వేకావాలి(Nuvve Kavali) మూవీ హీరోయిన్ అనగానే టక్కున గుర్తుపడతారు. విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, రిచా హీరోహీరోయిన్ల తెరకెక్కిన చిత్రం "నువ్వే కావాలి". మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు అందించిన మాటలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. తరుణ్, రిచా తమ యాక్టింగ్ తో అదరగొట్టేసాడు. ఇక సునీల్ కామెడీకి తిరుగులేదు. కోటి అందించిన బాణీలు సూపర్ హిట్టయ్యాయి. ఈ సినిమా తర్వాత తరుణ్ స్టార్ హీరో అయ్యాడు. వరుస ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రిచాకు మాత్రం సక్సెస్ రాలేదు. ఇంతకీ రిచా ఇప్పుడు ఎలా ఉంది? అనే డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం రండి.

రిచా బెంగళూరులో పుట్టింది. అన్ని భాషలపై పట్టు సాధించింది. మొదటి సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డు అందుకుని తర్వాత సినిమా కెరీర్ లో నిలదొక్కుకోలేక పోయింది రిచా. సినిమా అవకాశాలు వచ్చినా అవి అంతగా హిట్ అవ్వలేదు.తమిళ్ స్టార్ హీరో విజయ్ తో షాజహాన్ అనే సినిమాలో నటించింది. కానీ అది కూడా ప్లాప్ అయ్యింది.యాష్ రాజ్ ఫిలిమ్స్ లో నీల్ అండ్ నిక్కీ అనే సినిమాలో నటించింది. ఆ మూవీ కూడా పెద్దగా స్టార్ డం తీసుకురాలేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా తమిళ్ రీమేక్ లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. కొన్నాళ్ల తర్వాత తెలుగులో ఇంకోసారి అనే సినిమాతో వచ్చింది. దీంతో ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పి వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story