Ram Pothineni : ఆకట్టుకుంటోన్న నువ్వుంటే చాలే పాట

రామ్ పోతినేని, భాగ్య శ్రీ బోర్సే జంటగా, ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తోన్న సినిమా ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. పి. మహేష్ బాబు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. విశేషం ఏంటంటే ఈ పాటను హీరో రామ్ పోతినేనే రాశాడట. వివేక్ - మెర్విన్ ద్వయం సంగీతం అందించిన ఈ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ పాడాడు. అప్పుడే ప్రేమలో పడ్డ కుర్రాడు తన భావాలను పంచుకునే సందర్భంగా వచ్చే గీతంలా ఉంది ఈ పాట. రామ్ రాసిన సాహిత్యం అందుకు తగ్గట్టుగా ఆకట్టుకునేలా ఉంది.
“ఒక చూపుతో నాలోనే పుట్టిందే
ఏదో వింతగా గుండెల్లో చేరిందే
నివ్వు ఎవ్వరో నాలోనే అడిగానే
తానేగా ప్రేమని తెలిపిందే
పరిచయం లేదని అడిగా
ప్రేమంటే కలిశాంగా
ఇకపై మనమేగా అందే
వెతికిన దొరకని అర్థం ప్రేమదే
అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే
నువ్వుంటే చాలే..’’
అంటూ మొదలైన పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. అయితే అనిరుధ్ కాకుండా ఎవరైనా తెలుగు బాగా తెలిసిన వారితో పాడించి ఉంటే బావుండేది అన్న భావన కూడా కలుగుతుంది. ఏదేమైనా పాట మాత్రం బావుంది. వినగానే ఆకట్టుకునేలా మెలోడీ. కొత్త సంగీత దర్శకుల టేస్ట్ కూడా తెలుస్తోంది ఈ ట్యూన్ లో. వింటేజ్ సాంగ్ లా ఉంది కాబట్టి సినిమాలో ఇంకా బావుండే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com