జూలై 7న 'ఓసాథియా' రిలీజ్
సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’. ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించారు. జూలై 7న పాన్ ఇండియా స్థాయిలో UFO మూవీస్ ద్వారా సినిమాను రిలీజ్ చేనున్నట్లు చిత్ర యునిట్ తెలిపింది. తన్వికా–జశ్వికా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కించిన ఈ సినిమాతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మాతలుగా వ్యవహరించారు.
ఓ సాథియా చిత్రం విడుదల తేది ప్రకటించిన తర్వాత నిర్మాత సుభాష్ మాట్లాడుతూ.. చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు ముఖ్య కారణం UFOసంస్థ అని తెలిపారు. ఈ సినిమాకి పాటలు బ్యాక్ బోన్ అని, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేము సపోర్ట్ చేస్తామని ఆయన ముందుకొచ్చినట్లు నిర్మాత సుభాష్ చెప్పారు.
ఇటువంటి సినిమాలో కంటెంటే బలం అని నమ్ముతున్నాను అని చెప్పిన నిర్మాత సుభాష్.. తమ ఓ సాథియా చిత్రాన్ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నందుకు గాను UFO మూవీస్ వారికి స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఈ చిత్రానికి డిఓపి ఈ.జె.వేణుకాగా, ఎడిటర్ గా కార్తీక్ కట్స్ వ్యవహరిస్తున్నారు. సంగీతం విన్నూ అందిస్తుండగా, లిరిక్స్ భాస్కరభట్ల, అనంత శ్రీరామ్, రాంబాబు గోసాల సమకూరుస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com