జాతీయ సినిమా దినోత్సవం.. ఆ రోజు టికెట్ ధర రూ.99 మాత్రమే..

మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అక్టోబరు 13వ తేదీని జాతీయ సినిమా దినోత్సవం కోసం నిర్ణయించింది. సినిమా ఔత్సాహికుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినిమా హాళ్లలో ప్రవేశానికి రూ.99 మాత్రమే వసూలు చేయనున్నట్లు జాతీయ మల్టీప్లెక్స్ ట్రేడ్ బాడీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
ఈ ఏడాది అక్టోబర్ 13న జాతీయ సినిమా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) గురువారం ప్రకటించింది.PVR INOX, Cinepolis, Miraj మరియు Delite సహా భారతదేశం నుండి మల్టీప్లెక్స్‌లలో 4,000 స్క్రీన్‌లు జాతీయ సినిమా దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాయని పేర్కొంది. “ఈ ప్రత్యేక సందర్భం ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద చాలా చిత్రాలు అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలో సినిమా ఆనందాన్ని పొందేందుకు అన్ని వయసుల ప్రేక్షకులను ఒకచోట చేర్చింది.
"ఈ విజయానికి సహకరించిన సినీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక 'ధన్యవాదాలు'. విజయవంతమైన చిత్రాలను థియేటర్ కు వెళ్లి చూడని ప్రేక్షకులకు ఇదే మా ఆహ్వానం అని అసోసియేషన్ తెలిపింది. MAI ప్రకారం, సినీ ప్రేక్షకులు అక్టోబర్ 13న రిక్లైనర్ మరియు ప్రీమియం ఫార్మాట్‌లను మినహాయించి రూ.99 చెల్లించి ఏ సినిమా అయినా చూడవచ్చు. గత సంవత్సరం, అసోసియేషన్ సెప్టెంబరు 23న జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com