Odela 2 : ఆల్ టైమ్ డిజాస్టర్ దిశగా ఓదెల 2..

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ‘ఓదెల2’అనూహ్యంగా చాలా అంటే చాలా దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఈ మూవీపై రిలీజ్ కు ముందు చాలా బజ్ ఉంది. టీజర్, ట్రైలర్స్ తో తిరుగులేని ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ క్వాలిటీతో కనిపించాయి. ఓ మంచి డివోషనల్ మూవీ చూడబోతున్నాం అనేలా కలరింగ్ కనిపించింది. బట్ ఓపెనింగ్స్ చూస్తే చాలా పూర్ గా ఉన్నాయి. ఎంతలా అంటే.. కనీసం మొదటి రోజు కోటి రూపాయలు కూడా కలెక్ట్ చేయలేనంత పూర్ ఓపెనింగ్స్ వచ్చాయీ చిత్రానికి. అంటే రిలీజ్ కు ముందు ఉన్న బజ్ ఓపెనింగ్స్ తేవడంలో పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పాలి.
తమన్నా స్క్రీన్ ప్రెజెన్స్ బావున్నా.. ఆ పాత్రకు తగ్గ స్టేచర్ కనిపించలేదు. డివోషనల్ అని చెప్పినా చాలా బ్లండర్స్ చేశారు కథనంలో. అందరూ మూత్రం పోసే ప్రేతాత్మ బొందపై ఎలాంటి క్లీనింగ్ ప్రక్రియ లేకుండా శివుడి వాహనమైన నంది విగ్రహాలు పెడతారు. ఇది చాలామందిని బాధించింది. బలమైన పాత్రగా ఉంటుందనుకున్న తమన్నా ఎంట్రీ బావున్నా.. ఆ తర్వాత సినిమా అంతా నీరసంగా ఉంటుందా పాత్ర. ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిన పాత్ర కావడం.. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ ప్రేక్షకుల సహనంతో ఫుట్ బాల్ ఆడుకోవడం.. ఈ కాలంలో కూడా ఊరందరికీ దేవుడు దర్శనం ఇవ్వడం, గుడిలోని నంది విగ్రహం నడిచి రావడం.. ఇవన్నీ ఓవర్ ద బోర్డ్ అనిపించాయి. ఇవన్నీ కథా పరమైన లోపాలైతే..
కథనం పరంగా చూస్తే కాస్త కళ్లు మూసుకుని వింటే మరోసారి అరుంధతి చూస్తున్నామా అనిపించేలా విలన్ వాయిస్ ఓవర్, అందులోనూ కామం నిండిన మాటలు, దేవుడిని సవాల్ చేస్తూ అఖండను గుర్తుకు తేవడం.. ఊరందరినీ బంధించి విరూపాక్షను గుర్తుకు తేవడం.. ఇలా చెప్పుకుంటూ ఏ ఒక్కటీ కొత్త సన్నివేశం కనిపించదు. కేవలం తమన్నా మెప్పుకోసం ఆమెకు అరుంధతి లాంటి మూవీ ఇస్తున్నాం అని భ్రమింప చేసి రూపొందించిన సినిమాలా ఉంది తప్ప.. ఎక్కడా, కథ, కథనాల్లో బలం కనిపించదు. ఫస్ట్ హాఫ్ లో ఓ అరగంటకు పైగా ఎంగేజ్ చేసింది. ఓ మంచి సినిమా చూడబోతున్నాం అనే ఫీలింగ్ ఇచ్చారు. బట్ తమన్నా రాకతో సినిమా నత్త నడక స్టార్ట్ అవుతుంది. లాజిక్ కు అస్సలే మాత్రం అందని సన్నివేశాలు, డైలాగులతో కావాల్సినంత విసిగించాడు ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేసిన సంపత్ నంది. ఈ మొత్తంలో దర్శకుడు అశోక్ తేజను అనడానికేం లేదు. ఎందుకంటే అతనేమైనా చేశాడు అనడానికి ఆస్కారం ఇవ్వలేదు సంపత్ నంది. మొత్తంగా ఈ యేడాది ఫస్ట్ హాఫ్ లో ఆల్ టైమ్ డిజాస్టర్స్ జాబితాలోకి డైరెక్ట్ గా వెళ్లబోతోందీ ఓదెల 2 అంటున్నారు ట్రేడ్ అనలిస్ట్ లు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com