O.G Movie : ఓ.జి సీక్వెల్ .. సెకండ్ పార్ట్ లో ఏం ఉండబోతోంది..?

O.G Movie :  ఓ.జి సీక్వెల్ .. సెకండ్ పార్ట్ లో ఏం ఉండబోతోంది..?
X

చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో తిరుగులేని జోష్ కనిపిస్తోంది. ఓ.జి కి సూపర్ హిట్ టాక్ వచ్చింది. మామూలుగా పవన్ మూవీస్ కు హిట్ టాక్ వస్తేనే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇక సూపర్ హిట్ అంటే రికార్డులూ క్రియేట్ అవుతాయి. అవుతాయేంటీ.. అవుతున్నాయి కూడా. ఆల్రెడీ ప్రీమియర్స్ తో పాటు ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే ఓ.జి 150 కోట్ల వరకూ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్ట్ లు. ఇక ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నా సినిమాకు సీక్వెల్ అనే మాట ఫ్యాన్స్ లో మరింత ఉత్తేజాన్ని నింపింది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలు ఆపేస్తాడు అనే ప్రచారం జరిగింది. అందులో నిజం లేదు అనేందుకే ఈ సీక్వెల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

ఇక సీక్వెల్ కు సంబంధించి కరెక్ట్ లీడ్స్ బానే కనిపిస్తున్నాయి. ఈ పార్ట్ లో బలమైన విలన్ లేకపోవడం కొంత మైనస్ గా కనిపించింది. ఆ లోటును సెకండ్ పార్ట్ లో తీరుస్తారు అనేలా లీడ్ ఉంది. ఓ.జి క్లైమాక్స్ లో జపాన్ నుంచి ఒకతను వస్తాడు. యకూజా అనే గ్యాంగ్ స్టర్ టీమ్ మొత్తాన్ని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ తుదముట్టించేస్తాడు. ఇదే వ్యక్తి పవన్ కళ్యాణ్ గురువుతో పాటు అతని వద్ద శిక్షణ పొందిన వంద మంది యోధుల్లో 99 మందిని చంపేస్తాడు. తప్పించుకున్న ఆ ఒక్కడే ఈ ‘ఓజాస్ గంభీర’. తమ వారిని చంపిన యకూజా టీమ్ మొత్తాన్ని అంతం చేస్తాడు. వారి నాయకుడే క్లైమాక్స్ లో విలన్ ‘ఓమి’కి వెపన్ డీల్స్ ఇప్పించిన మిడిల్ ఈస్ట్ కు చెందిన మరో గ్యాంగ్ స్టర్ తో కలిసిపోతాడు. ఈ ఇద్దరూ కలిసి మళ్లీ గంభీరపై అటాక్స్ మొదలుపెట్టొచ్చు. అప్పుడు కథ పూర్తిగా ఇండియాను దాటి ఇంటర్నేషనల్ లెవల్ కు వెళ్లొచ్చు. పైగా గంభీర కూడా మళ్లీ కొత్త టీమ్ ను తయారు చేసుకుని ఉన్నాడు. సో.. ఈసారి గ్యాంగ్ వార్ ఇంటర్నేషనల్ రేంజ్ కు వెళుతుంది. కాకపోతే ఈ సీక్వెల్ అనౌన్స్ మెంట్ కే పరిమితమా లేక ఆచరణలోకీ వస్తుందా అనేది చూడాలి.

Tags

Next Story