They Call Him O.G : ఓ.జి షోస్ క్యాన్సిల్

దే కాల్ హిమ్ ఓ.జి అంటూ రాబోతోన్న మూవీ షోస్ క్యాన్సిల్ అయ్యాయి. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు షాక్ ఇచ్చేదే. అయితే ఇందులో రాజకీయ పరమైన సమస్యలు ఉన్నాయంటూ క్యాన్సిల్ కావడమే అన్ని వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. అయితే ఇది ఇండియాలో కాదు.. నార్త్ అమెరికాలో కావడం విశేషం. యస్.. నార్త్ అమెరికాలో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న యార్క్ సంస్థ ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ మూవీకి సంబంధించి కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఇది మా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేదే అయినప్పటికీ.. సినిమా ఆపక తప్పడం లేదు అంటూ ఆ ప్రకటనలో పేర్కొంది.
యార్క్ ప్రకటన చూస్తే .. "ఈ సినిమా పంపిణీలో సాంస్కృతిక, రాజకీయ శక్తులు ఉన్నాయి. అవి ప్రజా భద్రతకు ముప్పు" అని గుర్తించాం.ఓ.జి సినిమా డిస్ట్రిబ్యూటర్లకు చెందిన కొందరు కృత్రిమంగా టికెట్స్ ఎక్కువ అమ్ముడు పోయినట్టు చెప్పమని మమ్మల్ని స్పందించారు. అటువంటి అనైతిక పనులకు పాల్పడం" అని ఆ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న వారికి పూర్తి అమౌంట్ ను తిరిగిచెల్లిస్తాం అని కూడా చెప్పింది యార్క్ సంస్థ. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే మనవాళ్లు ఇండియాలో లాగా అక్కడ కూడా సినిమాల కోసం ర్యాలీలు తీయడం.. థియేటర్స్ లో పేపర్స్ విసరడం.. విజిల్స్ కొట్టడం.. ఇతర ప్రేక్షకులను ఇబ్బందులు పెట్టడం అనేది కొన్నాళ్లుగా జరుగుతోంది. ఆ కారణంగా ఈ మధ్య సినిమాలను మధ్యలోనే ఆపేసి ఆడియన్స్ ను బయటకు పంపిస్తుండటం కూడా చూస్తున్నాం. ఈ అతి వల్లనే ఇలాంటి ఇష్యూస్ తలెత్తుతున్నాయి అనుకోవచ్చు. మనది కాని దేశంలో ఇలా చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని చాలామంది చెబుతూనే వస్తున్నారు. అయినా కొందరు మారడం లేదు. అందుకే ఈ ఉదంతం మరో ఉదాహరణ.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com