Suhas : అమ్మాయిలను నమ్మొద్దు అంటున్న సుహాస్

చిన్న పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి, ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తున్నాడు సుహాస్. కంటెంట్ బేస్డ్ మూవీస్ తో ఆకట్టుకుంటూ వస్తోన్న సుహాస్ తాజాగా ‘ఓ భామా అయ్యో రామా’ అనే మూవీతో వస్తున్నాడు. రామ్ గోధల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని హరీష్ నల్లా నిర్మిస్తున్నాడు. తమిళ్ లో మది అనే మూవీతో ఓవర్ నైట్ ఫేమ్ అయిన మాళవిక మనోజ్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోందీ మూవీతో. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ మూవీ టైటిల్ కు తగ్గట్టుగానే ఓ గడసరి అయిన అమ్మాయి, కాస్త భయస్తుడైన అబ్బాయికి మధ్య సాగే కథగా కనిపిస్తోంది. ఆమెను ప్రేమిస్తున్నా చెప్పాలంటే భయపడే హీరో.. అతన్ని డైరెక్ట్ గా తన ఫ్యామిలీకే పరిచయం చేస్తూ.. ఇతన్నే పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పే ధైర్యం ఉన్న అమ్మాయి.. వీరి మధ్య సాగే ఎంటర్టైనింగ్ కంటెంట్ తో పాటు ఇన్ డైరెక్ట్ గా ఇంకేదో విషయం ఉండబోతోందనేలా ఉంది టీజర్. సింపుల్ గా చెబితే చూడగానే ఆకట్టుకునేలా ఉంది. టీజర్ చివర్లో అమ్మాయిలను నమ్మొద్దు బాబూ అనుభవంతో చెబుతున్నా అంటూ సుహాస్ ఓ చిన్న పీటపై కూర్చుని చెబుతుండటం..ఆ సీన్ కు అంతకు ముందు వచ్చిన డైలాగ్ కనెక్ట్ అయి ఉండటం బావుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ హైలెట్ గా ఉండబోతోందని టీజర్ తోనే అర్థం అవుతుంది. ఆ అమ్మాయి మాళవి కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. సుహాస్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. ఈ మధ్య ఓ రెండు మూడు సినిమాలు పోయాయి. కానీ ఈ సారి మళ్లీ ట్రాక్ ఎక్కేలా ఉన్నాడు సుహాస్. ఈ సమ్మర్ లోనే విడుదల చేయబోతున్నాం అంటున్నారు. మరి సుహాస్ ఈ సత్యభామతో కలిసి విజయం సాధిస్తాడా లేదా అనేది చూద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com