Oke Oka Jeevitham : 'ఒకే ఒక జీవితం' మూవీ ట్రైలర్ రిలీజ్.. ఎమోషన్ ప్లస్ టైం ట్రావెల్..

Oke Oka Jeevitham : శర్వానంద్, రీతూ వర్మ జోడీగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'ఒకే ఒక జీవితం' ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రియదర్శి, వెన్నల కిషోర్ కూడా ఇందులో మెయిన రోల్స్ ప్లే చేశారు. కథ విషయానికి వస్తే.. చిన్న వయసులో జరిగిన ప్రమాదంలో ఓ పిల్లాడు తన తల్లిని కోల్పోతాడు. అయితే వయసులోకి వచ్చిన తరువాత తిరిగి మళ్లీ చిన్నప్పటి కాలానికి వెళ్లి.. అప్పుడు చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాడు. మరి సక్సస్ అవుతాడో లేదో సినిమా చూస్తేనే అర్ధమవుతుంది.
ఇది టైం ట్రావెల్‌కు సంబంధించిన చిత్రం.. ఇలాంటి సైన్స్ ఫిక్షన్‌లో శర్వానంద్ మొదటి సారి నటించాడు. అక్కినేని అమల పాత్ర కూడా భావోద్వేగంగా సాగుతుంది. శ్రీ కార్తిక్ దీనికి దర్శకత్వం వహించాడు. తరుణ్ భాస్కర్ మాటలు అందించారు. సెప్టెంబర్ 9న థియేటర్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com