Olivia Morris : కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్‌ని చూసి కన్నీళ్లు వచ్చాయి : ఒలీవియా

Olivia Morris : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీలో బ్రిటిష్ నటి ఒలీవియా మోరీస్ జెన్నీఫర్ పాత్రలో ఒదిగిపోయింది. ఇందులో ఆమె ఎన్టీఆర్‌కి జోడీగా నటించింది. ఇటీవల RRR సినిమాని చూసిన ఆమె.. ఎన్టీఆర్ పైన ప్రశంసలు కురిపించింది. ఎన్టీఆర్ అద్భుతమైన వ్యక్తి. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని ఆకాశానికి ఎత్తేసింది. ముఖ్యంగా 'కొమురం భీముడో' పాటలో ఎన్టీఆర్‌ని చూసి కన్నీళ్లు వచ్చేశాయని తెలిపింది.
ఆ పాటలో వచ్చే సన్నివేశాలకు తానెంతో భావోద్వేగానికి గురయ్యానని పేర్కొంది. ఇక చరణ్ తాను మంచి స్నేహితులమయ్యామని, ఎక్కువగా లండన్ పరిసర ప్రాంతాల గురించి మాట్లాడుకునేవాళ్లమని వెల్లడించింది. ఇక నాటు నాటు పాట తన బాయ్‌ఫ్రెండ్‌కి బాగా నచ్చిందని, ఆ స్టెప్స్ తరుచుగా ఇంట్లో ట్రై చేస్తున్నట్టుగా తెలిపింది. దర్శకుడు రాజమౌళి గురించి మాట్లాడుతూ.. ఆయనో గొప్ప దర్శకుడని, ఏ సీన్‌ని ఎలా తెరకెక్కించాలనే విషయంలో ఆయనకు స్పష్టత ఉంటుందని, నటీనటులను తనకు కావాల్సిన విధంగా ఆయన మలచుకోగలడని పేర్కొంది.
ఈ సినిమా కోసం 20 రోజులు డేట్స్ కేటాయించింది ఒలీవియా.. కాగా RRR సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించి మెప్పించారు. కీరవాణి సంగీతం అందించగా, విజయేంద్రప్రసాద్ కథని అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com