ఓం శాంతి ఓం నటుడు కన్నుమూత..

ఓం శాంతి ఓం నటుడు కన్నుమూత..
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు నితీష్ పాండే (51) కన్నుమూశారు.

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు నితీష్ పాండే (51) కన్నుమూశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో నిన్న రాత్రి షూటింగ్ ముగించుకుని హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నిద్రలోనే గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నితీష్ మృతి పట్ల పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

నితీష్ మరణవార్తపై బంధువు, నిర్మాత సిద్ధార్థ్ నగర్ స్పందిస్తూ.. 'అతను మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లి పోయాడు. నా సోదరి అర్పితా పాండే (నితీష్ భార్య) షాక్‌లో ఉంది. మా అందరికీ షాకింగ్. అతను నాకంటే చిన్నవాడు. ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు' అని తెలిపారు.

ప్రముఖ టీవీ సీరియల్ అనుపమతో పాటు, నితీష్ కుచ్ తో లాగ్ కహెంగే, ప్యార్ కా దర్ద్ మీఠా మీఠా ప్యారా ప్యారా, ఏక్ రిష్తా సజేదారి కా వంటి అనేక సీరియల్స్‌లో నటించారు. బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా నటుడిగా విభిన్న పాత్రలో పోషించాడు. షారూఖ్ ఖాన్ ఓం శాంతి ఓం సినిమాలో నటించాడు. బడై దో, దబాంగ్ 2, మదారి వంటి పలు చిత్రాల్లో నటించారు. అభయ్, వాట్ ద ఫోక్స్ వంటి అనేక వెబ్ సిరీస్‌లలో కూడా నితీష్ నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story