OMG 2: 'A' రేటింగ్.. నగ్న దృశ్యాలు, కండోమ్ పోస్టర్లకు కత్తెర

ఓ మై గాడ్ 2(OMG 2) సర్టిఫికేషన్ సమస్యల కారణంగా ఇటీవలి కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రం ఓ మై గాడ్ పేరుతో 2012లో వచ్చిన హిట్ చిత్రానికి ఆధ్యాత్మిక సీక్వెల్. అయితే గత కొన్ని రోజులుగా, ఈ సినిమాపై పలు విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో CBFC బోర్డు నుండి సర్టిఫికేషన్‌లో మార్పుల కారణంగా ఈ చిత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి మేకర్స్ వాస్తవానికి U/A రేటింగ్‌ని పొందాలని భావించారు. కానీ దానికి సెన్సార్ బోర్డు సూచనలను, డిమాండ్ ను దృష్టి పెట్టుకుని.. వారు OMG 2కి 'A' రేటింగ్‌ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక తాజా అప్‌డేట్ విషయానికొస్చతే ఈ సినిమాకు అడల్డ్ సర్టిఫికేషన్ ఇచ్చి షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్టు.. కొన్ని ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైన సవరణలు చేయాలని ఆదేశించింది.
OMG 2కు బోర్డు సూచించిన సవరణలు
ఓ మై గాడ్ సినిమాకు సంబంధించిన బోర్డు సూచించిన సవరణల జాబితా నుండి తాజాగా కొన్ని విషయాలు బయటపడ్డాయి. అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి నటించిన ఈ సినిమాలో నగ్నత్వంతో కూడిన సన్నివేశాలను తొలగించాలని CBFC బోర్డు సూచించింది. దాని స్థానంలో నాగ సాధువులకు తగిన విజువల్స్ ఉండాలని చెప్పింది. మద్యం దేవుడికి నైవేద్యంగా అని మాట్లాడే డైలాగ్ కూడా ఈ మూవీలో ఉన్నట్లు తెలుస్తోంది. దాన్ని కూడా సవరించాలని బోర్డు సభ్యులు కోరారు. OMG 2 మేకర్స్ ను కండోమ్ ప్రకటన పోస్టర్‌ను కూడా తీసివేయమని సూచించారు. అసహజ శృంగారానికి సంబంధించిన శిల్పాల వివరణలతో దృశ్యాలను కూడా సవరించాలని చెప్పారు.
అంతేకాదు అమిత్ రాయ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఓ విచిత్రమైన సవరణ చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది. OMG 2లో ఓ సన్నివేశంలో కనిపించే ఎలుక పాయిజన్ బాటిల్‌పై ఎలుక అనే పదాన్ని ఉపయోగించడాన్ని కూడా మార్చాలని కోరారు. అంతే కాకుండా కోర్టు హాలులో జడ్జి సెల్ఫీలు దిగుతున్న దృశ్యాన్ని, ఉజ్జయిని వంటి ప్రదేశాల ప్రస్తావనను కూడా సవరించాలని కోరినట్టు తెలుస్తోంది.
OMG 2 వివాదం
OMG 2 మూవీ అనేది సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెబుతుందన్నది ప్రధానాంశంగా తెలుస్తోంది. ఇది సెన్సివిటీతో కూడుకున్న విషయం కాబట్టి సర్టిఫికేషన్ జారీలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పైగా మహాకాళేశ్వర ఆలయ పూజారి మహేశ్ శర్మ.. కొన్ని అడల్ట్ సీన్లతో కూడిన సినిమా గురించి తెలిసి ఎ రేటింగ్ తెచ్చుకున్న తర్వాత ఆలయంలో చిత్రీకరించిన సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. తన డిమాండ్‌ను నెరవేర్చకుంటే ఆందోళనకు దిగుతానని కూడా ప్రకటించారు.
అక్షయ్ కుమార్ 12 ఏళ్లలో ఓ సినిమాకూ A రేటింగ్ పొందలేదు. ఇలా ఆయన సినిమా A రేటింగ్ పొందడం ఇదే మొదటిసారి. కానీ అతని కెరీర్లో మాత్రం ఇది రెండవది. A రేటింగ్ పొందిన అతని చివరి చిత్రం దేశీ బాయ్జ్. కాగా OMG 2లో యామీ గౌతమ్, గోవింద్ నామ్‌దేవ్, అరుణ్ గోవిల్ కూడా నటించగా.. ఈ సినిమా ఆగస్టు 11, 2023న విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com