OMG 2 Box Office Collection : రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిన 'ఓ మై గాడ్'

OMG 2 Box Office Collection : రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిన ఓ మై గాడ్
X
విడుదలైన 9 రోజుల్లోనే రూ.100 కోట్లు క్రాస్ చేసిన అక్షయ్ సిినిమా

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి కలిసి నటించిన ఓ మై గాడ్ ఇటీవల విడుదలైంది. ఈ మూవీ రిలీజైన కేవలం 9 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటింది. ఈ చిత్రం ఆగస్టు 19న రూ. 10.5 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తం దేశీయ బాక్సాఫీస్ కలెక్షన్ రూ. 101.58 కోట్లకు చేరుకుంది. కాగా ఈ చిత్రంలో అక్షయ్ కుమార్‌తో పాటు పంకజ్ త్రిపాఠి, యామీ గౌతమ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

OMG 2 రోజు వారీ కలెక్షన్లు:

మొదటి రోజు: రూ. 10.26 కోట్లు

2వ రోజు: రూ. 15.3 కోట్లు

3వ రోజు: రూ. 17.55 కోట్లు

4వ రోజు: రూ. 12.06 కోట్లు

5వ రోజు: రూ. 17.1 కోట్లు

6వ రోజు: రూ. 7.2 కోట్లు

7వ రోజు: రూ. 5.58 కోట్లు

8వ రోజు: రూ. 5.6 కోట్లు

9వ రోజు: రూ. 10.5 కోట్లు

మొత్తం : రూ 101.58 కోట్లు

OMG 2 అనే సినిమా 2012లో అక్షయ్ కుమార్ నటించిన ఓ మై గాడ్ చిత్రానికి సీక్వెల్. ఈ చిత్రంలో శివుని దూత పాత్రను అక్షయ్ పోషించాడు. ఈ చిత్రాన్ని ప్రారంభంలో సెన్సార్ బోర్డు తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత చిత్రంలో దాదాపు 27మార్పులు చేయాలని చిత్రనిర్మాతలకు సూచించింది. అనంతరం OMG 2కి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'పెద్దలకు మాత్రమే (A)' అంటే అడల్ట్ సర్టిఫికేట్ ను జారీ చేసింది.

OMG 2లో శివుడి దూతగా అక్షయ్ కుమార్ సెక్స్ ఎడ్యుకేషన్ ఆధారంగా కోర్టులో పోరాడుతున్న పంకజ్ త్రిపాఠికి సహాయం చేయడానికి వస్తాడు. “ఇతర నటీనటులకు స్క్రిప్ట్‌ని వినోదాత్మకంగా చెప్పడం నుండి, వినడం ద్వారా అన్ని సన్నివేశాలను గుర్తుపెట్టుకోవడం వరకు, అక్షయ్ సార్ నటుడిగా, నిర్మాతగా 'OMG 2' నిర్మాణంలో డీప్ గా నిమగ్నమయ్యాడు. అతను మరింత సృజనాత్మక నిర్మాత వలె పనిచేశాడు. సినిమాలోని పలు సన్నివేశాలను కూడా ఇంప్రూవ్ చేశాడు. విమర్శలను నివారించడానికి కొన్ని సన్నివేశాలను ఎలా సర్దుబాటు చేయాలో సలహాలు ఇచ్చాడు. ఉదాహరణకు హస్తప్రయోగం సన్నివేశాన్ని సరిగ్గా షూట్ చేయమని చెప్పి, 'అదేంటో తర్వాత చూద్దాం' అన్నారు. నేను నా కథలను ఎలా చెప్పాలనుకుంటున్నానో చాలా ఓపెన్‌గా ఉన్నాను" అని ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు అమిత్ రాయ్ చెప్పుకొచ్చాడు.


Tags

Next Story