అక్షయ్ కుమార్‌ను కొడితే రూ.10 లక్షలు.. హిందూ పరిషత్ రివార్డు

అక్షయ్ కుమార్‌ను కొడితే రూ.10 లక్షలు.. హిందూ పరిషత్ రివార్డు
మంచి సినిమా తీశామనుకుంటున్నారేమో.. కానీ మా మనోభావాలను దెబ్బతీశారు.

మంచి సినిమా తీశామనుకుంటున్నారేమో.. కానీ మా మనోభావాలను దెబ్బతీశారు.. దేవుడితో ఆటలా.. శివుడిని అలా చిత్రీకరిస్తారా.. అందుకే శివుడి పాత్రలో నటించిన అక్షయ్ కుమార్ ను చెంపదెబ్బ కొట్టడమో లేదా ఉమ్మి వేయడమో చేస్తే రూ.10 లక్షలు రివార్డు అందిస్తామని రాష్ట్రీయ హిందూ పరిషత్ భారత్ ప్రకటించింది.

పంకజ్ త్రిపాఠి నటించిన సినిమాపై నిషేధం విధించాలని హిందూ సంస్థ డిమాండ్ చేసింది. ఆగ్రాలో సినిమాను నిషేధించాలనే డిమాండ్‌తో ప్రదర్శనలు చేశారు. అక్షయ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. 'OMG 2' ఆగస్ట్ 11న విడుదలైంది.

ఓహ్ మై గాడ్ 2 (OMG 2)లో శివుడి దూత పాత్రతో ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది రాష్ట్రీయ హిందూ పరిషత్ భారత్. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ బూట్లు వేసుకోవడం, కచోడీలు కొంటూ మురికి చెరువులో స్నానం చేయడం వంటి సన్నివేశాలు ఉంటాయి. ఇవి దేవుడి ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని హిందూ పరిషత్ ప్రెసిడెంట్‌ గోవింద్‌ పరాశర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story