Akshay Kumar: OMG 2 ట్రైలర్ రిలీజ్

Akshay Kumar: OMG 2 ట్రైలర్ రిలీజ్
X
నందీ నా భక్తునికి ఆపద రాబోతోంది. అతనికి సహాయంగా నా గణంలోంచి ఒకరిని తీసుకెళ్లు

"నందీ నా భక్తునికి ఆపద రాబోతోంది. అతనికి సహాయంగా నా శివగణంలోంచి ఒకరిని తీసుకెళ్లు, అతని ఆపదను దూరం చేయడానికి" అనే శివుని ఆజ్ఞతో OMG 2 ట్రైలర్ మొదలవుతుంది. అక్షయ్ కుమార్ ప్రధానపాత్రలో OMG 2 ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకులను ముగ్ధులను చేస్తుంది. 2012లో హిట్ అయిన OMG కి సీక్వెల్ గా OMG 2 రాబోతోంది. అందులో భాగంగానే చిత్ర యునిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. నిన్న నితిన్ దేశాయ్ మరణంతో ఆవిడకు గౌవరసూచకంగా ట్రైలర్ వాయిదా పడి.. ఈరోజు విడుదల అయింది. ట్రైలర్ పలు విమర్శలకు తావిస్తున్నట్లు తెలుస్తోంది.


OMG 2 ట్రైలర్... శివుడు తన భక్తులలో ఒకరికి సహాయం చేయడానికి తన దూతలో ఒకదాన్ని పంపమని నందిని ఆదేశించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆపై పంకజ్ త్రిపాఠి పోషించిన క్రాంతి శర్మ ముద్గల్ అనే క్యారెక్టర్ ఫిర్యాదుదారు మరియు ప్రతివాది ఒకరేనని న్యాయమూర్తి గుర్తించి ఇదేమి చిత్రమైన కేసు అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అక్కడి నుంచి ఈ కథ అతని కుమారునివైపు తిరుగుతుంది. కుమారునికి చెందిన ఒక వీడియో ఇంటర్నెట్ లో లీక్ చేయబడిందని స్కూల్ యాజమాన్యం తండ్రి కొడుకులపై ఫైర్ అవుతుంది. అతన్ని స్కూల్ నుంచి బహిష్కరిస్తుంది. దీంతో సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు. యామీ గౌతమ్ స్కూల్ తరపున లాయర్ గా నటించింది.

OMG 2కు పలు సర్టిఫికేట్ సమస్యలు ఎదురయ్యాయి. సినిమాలో పలు సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని లిక్కర్ సీన్లపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం తెలిపింది. సదరు సీన్లను తొలగిస్తే U/A సర్టిఫికేట్ ఇస్తామని లేదంటే A సర్టిఫికెట్ ను జారీచేస్తామని చెప్పింది. సీన్లను తొలగిస్తే సినిమా సారాంశం మారిపోతుందనుకున్న చిత్ర యునిట్ A సర్టిఫికెట్ కు అంగీకరించింది. అక్షయ్ కుమార్ నటించిన సినిమాలలో A సర్టిఫికెట్ పొందిన సినిమా OMG2. అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి మరియు యామీ గౌతమ్ నటించిన OMG 2 ఆగస్టు 11న విడుదల కానుంది.

Tags

Next Story