Pushpa Movie: ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా అంటున్న పుష్ప రాజ్..

Pushpa Movie (tv5news.in)
Pushpa Movie: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలే ఉన్నాయి. అందుకే ఆ సినిమా నుండి చిన్న అప్డేట్ వచ్చినా.. వెంటనే ట్రెండ్ అయిపోతుంది. ఇప్పటికే విడుదలయిన సినిమా పాటలు, గ్లింప్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా విడుదలకు దాదాపు నెల సమయమే ఉండడంతో సుకుమార్ పూర్తిగా ప్రమోషన్స్‌పైన దృష్టిపెట్టాడు. అందులో భాగంగానే పుష్ప నుండి కొత్త సాంగ్ అప్డేట్‌ను ప్రేక్షకులకు అందించాడు.
ఇప్పటికే పుష్ప నుండి దాక్కో దాక్కో మేక లాంటి ఫోక్ సాంగ్‌తో పాటు, సామి సామి, శ్రీవల్లి లాంటి మెలొడీస్ కూడా విడుదలయ్యాయి. అయితే వాటికి భిన్నమైన గెటప్‌తో అల్లు అర్జున్ కనిపిస్తూ ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా అనే పాట నవంబర్ 19న విడుదల కానుంది. దీనికి సంబంధించిన అప్డేట్‌ను ఇటీవల మూవీ టీమ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Witness the swag of #PushpaRaj 😎#PushpaFourthSingle on 19th NOV 💥💥#EyyBiddaIdhiNaaAdda #EyyBetaIdhuEnPatta #EyyPodaIthuNjaanaada #EyyMagaIdhuNanJaaga #EyyBiddaYeMeraAdda#PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic pic.twitter.com/9f54EZHKn8
— Pushpa (@PushpaMovie) November 14, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com