Vijay Babu: 'అతడు నన్ను బలవంతంగా ముద్దుపెట్టుకోబోయాడు'.. హీరోపై మరో ఫిర్యాదు..

Vijay Babu: మాలీవుడ్ విజయ్ బాబుపై లైంగిక దాడి కేసు వ్యవహారం రోజురోజుకూ మరింత హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇటీవల ఓ నటి.. తనను విజయ్ బాబు శారీరికంగా లోబరుచుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు కూడా నమోదు చేశారు. అప్పటినుండి విజయ్ బాబు కనిపించకుండా పోయాడు. ఇంతలోనే మరో మహిళ కూడా తనతో విజయ్ బాబు తప్పుగా ప్రవర్తించాడన్న విషయాన్ని బయటపెట్టింది.
గతేడాది నవంబర్‌లో నటుడు, నిర్మాత, ఫ్రైడే ఫిలిం హౌస్ యజమాని విజయ్ బాబును ఒకసారి కలిశాను అంటూ ఓ మహిళ చెప్పుకొచ్చింది. అప్పుడు తన బాధలు విజయ్ బాబుకు చెప్పుకోగా తను హెల్ప్ చేస్తానని అన్నట్టు తెలిపింది. అప్పటివరకు తమతో ఉన్న వ్యక్తి బయటికి వెళ్లిపోవడంతో గదిలో వారు ఇద్దరే ఉన్నట్టు చెప్పింది ఆ మహిళ.
ఆ సమయంలో విజయ్ బాబు మద్యం సేవిస్తూ తనకు కూడా ఆఫర్ చేయగా ఆ మహిళ వద్దని చెప్పిందట. అప్పుడే అకస్మాత్తుగా విజయ్ బాబు తన పెదాలపై ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడట. వెంటనే తను దూరంగా జరిగిపోయి అతడి మొహం చూసిందట. అప్పుడు అతడు 'జస్ట్ వన్ కిస్' అని అడిగినట్టు చెప్పింది ఆ మహిళ. దీనికి తను అసలు ఒప్పుకోకుండా అక్కడి నుండి బయటికి వచ్చేసిందట.
తనను అలా బలవంతం చేయడం గురించి బయట ఎవ్వరితో చెప్పొద్దని మహిళను బతిమిలాడాడట విజయ్ బాబు. కానీ విజయ్ బాబు ప్రవర్తన వల్ల నటి కావాలనుకున్న తన కోరికను పక్కన పెట్టేసిందట మహిళ. ఈ విషయాన్ని తాను ఓ సోషల్ మీడియా పోస్ట్‌తో బయటపెట్టింది. ఇది చూసిన వారంతా ఇంకా విజయ్ బాబు ఎంతమందిని ఇలా హింసించాడో అని అనుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com