రాధిక, శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు శిక్ష

రాధిక, శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు శిక్ష
రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు శరత్‌కుమార్‌పై ఏడు, రాధికపై రెండు కేసులు నమోదయ్యాయి.

ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం నటులు, రాజకీయ నాయకులు శరత్‌కుమార్, ఆయన భార్య రాధిక శరత్‌కుమార్‌కు ఏడాది జైలు శిక్ష విధించారు. రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమైనందుకు శరత్‌కుమార్‌పై ఏడు, రాధికపై రెండు కేసులు నమోదయ్యాయి.

2015 లో రాధిక, శరత్‌కుమార్ నిర్మాణ సంస్థ రేడియంట్ గ్రూప్ నుంచి రుణాలు సేకరించి, ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించిన 'ఇడు ఎన్నా మాయం' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ జంట తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ అయినందున అప్పిచ్చిన సంస్థ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించింది. రేడియంట్ గ్రూప్ 2018 లో కోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో వారికి 2019లో అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. తదుపరి విచారణ అనంతరం న్యాయస్థానం వారికి ఏడాది జైలు శిక్ష విధించింది.

Tags

Next Story