పుష్ప రూలింగ్ కు ఇంక నెల రోజులే టైమ్

పుష్ప రూలింగ్ కు ఇంక నెల రోజులే టైమ్
X

దేవర తర్వాత టాలీవుడ్ ఆడియన్స్ కు ఆ రేంజ్ స్పాన్ ఉన్న ప్యాన ఇండియా సినిమా అంటే నెక్ట్స్ పుష్ప 2 ద రూలింగ్ మాత్రమే కనిపిస్తోంది. ఐకన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప కు సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లో టాలీవుడ్ రికార్డ్స్ అన్నీ కొల్లగొట్టింది. ఇంకా ట్రైలర్ కూడా రాకుండానే ప్రీ రిలీజ్ బిజినెస్ లో 1000 కోట్లు చేసింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మిక్స్ అయిన ఉన్న ఫిగర్స్ ఇవి. ఇప్పటికే విడుదలైన పాటలు చూస్తే ఈ సినిమాకు మరోసారి దేవీ శ్రీ ప్రసాద్ పెద్ద ఎసెట్ కాబోతున్నాడని అర్థం అవుతోంది.

పుష్ప అల్లు అర్జున్ కు ప్యాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని క్రేజ్ ను తెచ్చింది. ఆ మాటకొస్తే ఆ మేనరిజంస్ అన్నీ ప్రపంచ వ్యాప్తంగా వెళ్లాయి. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను డబుల్ చేయబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ నుఆల్రెడ ఇచ్చారు కాబట్టే ఆ రేంజ్ బిజినెస్ అయిందీ చిత్రానికి. ఇక రష్మిక మందన్నా, అనసూయ, సునిల్ తోపాటు జాలిరెడ్డి పాత్ర చేసిన ధనంజయ కంటిన్యూ అవుతున్నారు. ఫస్ట్ పార్ట్ ఎండ్ లో ఫారెస్ట్ ఆఫీసర్ బైరాన్ సింగ్ షెకావత్ గా నటించిన ఫహాద్ ఫాజిల్ తో పుష్పరాజ్ పెద్ద గొడవే పెట్టుకున్నాడు. దీంతో ఈ సారి ఈ రెండు పాత్రల మధ్యే వార్ సాగుతుందా.. లేక కొత్త విలన్స్ ఎంటర్ అవుతారా అనే ఆసక్తి కూడా అందర్లోనూ ఉంది.

ఇక డిసెంబర్ 5న విడుదల కాబోతోన్న పుష్ప - ద రూల్ కు ఇంకా నెల రోజులే టైమ్ ఉంది. సినిమాకు అయిన బిజినెస్ ను బట్టి చూస్తే ఈ నెల రోజులూ గట్టిగా ప్రమోషన్స్ చేయాలి. అందుకోసం ఈ సారి ఎలాంటి స్ట్రాటజీస్ తో ముందుకు వెళతారు అనే కోణంలోనూ చూస్తున్నారు చాలామంది. ఏదేమైనా నెల రోజుల్లో పుష్పరాజ్ బాక్సాఫీస్ రూలింగ్ మొదలు కాబోతోందన్నమాట.

Tags

Next Story