Gopichand - Sudheer Babu : దసరా బరిలో రెండే తెలుగు సినిమాలు

Gopichand - Sudheer Babu :   దసరా బరిలో రెండే తెలుగు సినిమాలు

దసరా అంటే తెలుగు సినిమాల సందడి పెద్దగానే కనిపిస్తుంది. అదీ టాప్ హీరోల మూవీస్ తో. బట్ ఈ సారి అలాంటిదేం కనిపించ లేదు. టాప్ హీరోలంతా సంక్రాంతికి షిఫ్ట్ అయ్యారు. దీంతో మొదట తమిళ్ మూవీ కంగువా రిలీజ్ డేట్ వేశారు. అదే టైమ్ కు రజినీకాంత్ వేట్టైయాన్ కూడా వేశారు. దీంత కంగువా తప్పుకుంది. అలాగే కన్నడ నుంచి మార్టిన్ అనే ప్యాన్ ఇండియా మూవీ కూడా అక్టోబర్ 10న రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఇక డబ్బింగ్ సినిమాలే గతి అనుకున్నారు చాలామంది. బట్ నేనున్నా అంటూ వచ్చాడు గోపీచంద్.

గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందిన విశ్వం మూవీని అక్టోబర్ 11న విడుదల చేయబోతున్నారు. గోపీచంద్ టైర్ టూ లో స్టార్ హీరోనే కాబట్టి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మంచి బిజినెస్ కూడా అయిందీ మూవీకి. హీరో, డైరెక్టర్ తో పాటు హీరోయిన్ కావ్య థాపర్ కూడా ఈ మూవీపై బోలెడు ఆశలు పెట్టుకుంది. విశ్వంతో టాలీవుడ్ లో తనకు హిట్ పడుతుందనే నమ్మకంతో ఉందీ బ్యూటీ. దసరా టైమ్ కాబట్టి సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ ముగ్గురికీ హిట్టు పడ్డట్టే.

విశ్వంతో పాటు వస్తోన్న మరో తెలుగు సినిమా మా నాన్న సూపర్ హీరో. సుధీర్ బాబు, ఆర్ణ జంటగా సాయి చంద్, షాయాజీ షిండే కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎలా చూసినా ఓ మంచి విజయం సాధించబోతోన్న సినిమా అనే ఫ్లేవర్ టీజర్ తోనే కలిగింది. మా నాన్న సూపర్ హీరోను కూడా అక్టోబర్ 11నే విడుదల చేయబోతున్నారు.

వీరితో పాటు ఈ నెలలో రిలీజ్ కావాల్సి ఉండి పోస్ట్ పోన్ అయిన సుహాస్ మూవీ జనక అయితే గనక అనే చిత్రాన్ని కూడా దసరా బరిలో విడుదల చేస్తారు అనే టాక్ ఉంది. ఇంకా కన్ఫార్మ్ చేయలేదు. ఒకవేళ ఈ మూవీ కూడా అదే టైమ్ కు వస్తే దసరా బరిలో రెండు డబ్బింగ్, మూడు స్ట్రెయిట్ మూవీస్ విడుదలవుతాయి. చూస్తుంటే డబ్బింగ్ సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా.. ఈ మూడు తెలుగు సినిమాలూ ఆకట్టుకునేలానే ఉన్నాయి.

Tags

Next Story