Bhairavam : గుండెలోన చప్పుడే లవ్వు గంట కొట్టెరో

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న సినిమా ‘భైరవం’. విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ తమిళ్ లో హిట్ అయిన గరుడన్ కు రీమేక్. కెకె రాధామోహన్ నిర్మిస్తున్నాడు. శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. రీసెంట్ గా వచ్చిన ప్రోమోతోనే ఇది హిట్ సాంగ్ అనిపించుకుంది. పాట చూస్తే అది నిజమే అనేలా ఉంది. సింపుల్ ట్యూన్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పాట ఇది. హీరో, హీరోయిన్ తో ప్రేమలో పడి తన లవ్ ను ఎక్స్ ప్రెస్ చేసే సందర్భంగా వచ్చే సాంగ్. ఇదే పాటలో హీరోయిన్ తో ‘నీ పక్కన చేరి నా దిక్కులు మారి నే కొత్తగ అయిపోయా’ అనిపించారు. అంటే ఇద్దరూ ప్రేమించుకుంటున్న విషయం ఈ పాటతో తేలిపోతుందన్నమాట.
శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ గీతాన్ని తిరుపతి జావన రాశాడు. అనురాగ్ కులకర్ణి, యామిని ఘంటసాల కలిసి పాడారు. టెంపో కాస్త ఎక్కువైనట్టు అనిపించినా.. వింటూ ఉంటే సాహిత్యం అర్థం అయ్యేలానే ఉంది. ‘గుండెలోన చప్పుడే లవ్వు గంట కొట్టెరో.. నేల పైన అడుగులే కొత్త స్టెప్పులేసెరో.. నీలి రంగు నింగిలోన గువ్వల గుంపు ఎగిరినట్టు.. ’అంటూ సాగిపోయే సాహిత్యానికి ‘ ఓ వెన్నెలా.. నీ మాయిలా నా మీదలా చల్లిపోకలా.. ఓ వెన్నెలా మా రాణిలా నూరేళ్లిలా ఉండిపో ఇలా.. ’ అంటూ వెన్నెల పదం హుక్ లైన్ లా కనిపిస్తోంది. మొత్తంగా ఫస్ట్ లిరికల్ సాంగ్ అంటే బెస్ట్ గా ఉండాలంటారు కదా.. ఈ పాట అలానే ఉంది.
ఈ మూవీలో శ్రీనివాస్ కు జోడీగా డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ నటించింది. ఈ ఇద్దరి మధ్యే ఈ పాట కనిపిస్తోంది. మరి మిగతా హీరోల సరసన ఎవరూ అంటే.. ఆనంది, దివ్యాపిళ్లై నటిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com