"నిజమే నే చెబుతున్నా" పాటకు 3 కోట్ల వ్యూస్
బ్యాక్ టూ బ్యాక్ చార్ట్ బస్టర్స్ హిట్ సాంగ్స్ డెలివేరీ చేస్తూ టాలీవుడ్ సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు శేఖర్ చంద్ర. తాజాగా సందీప్ కిషన్ నటిస్తున్న 'ఊరు పేరు బైరవకోన' సినిమా కోసం శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన "నిజమే నే చెబుతున్నా" లవ్ సాంగ్ యూ ట్యూబ్ లో 30 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇన్స్టా రీల్స్ తో ట్రెండింగ్ లో ఉంది. శేఖర్ చంద్ర స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సంగీతం అందించగా , సిద్ శ్రీరామ్ పాడారు.
శేఖర్ చంద్ర , సిద్ శ్రీరామ్ కాంబినేషన్ లో ఇప్పటికే "బాగుంటుంది నువ్వు నవ్వితే" , "ప్రియతమా ప్రియతమా" , 'మనసు దారి తప్పేనే' వంటి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన నాలుగవ సాంగ్ ఇది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శేఖర్ చంద్ర 'నిజమే చెబుతున్నా" సాంగ్ వైరల్ అవుతూ మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సాంగ్ సినిమాపై మంచి బజ్ తీసుకొచ్చింది. ఈ సందర్భంగా శేఖర్ చంద్ర మాట్లాడుతూ... నిజమే చెబుతున్నా సాంగ్ ఇంత సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ooru peru bhairavakona
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com