Oscar 2023 : గర్వంగా ఉంది : చిరంజీవి

Oscar 2023 : గర్వంగా ఉంది : చిరంజీవి
X

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని 'నాటు నాటు' పాటకు ఆస్కార్ రావడం గర్వంగా ఉందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. మీడియాతో మాట్లాడిన ఆయన... చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. చరణ్ ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉందన్న ఆయన, ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన ప్రతీఒక్కరికి అభినందనలు తెలిపారు. రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్ లు ఎంతో కష్టపడ్డారని చెప్పారు.

95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో తెలగు పాటకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కు ఆస్కార్ దక్కింది. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ ప్రతీ భారతీయుడికి గర్వకారణమని అన్నారు. ఆస్కార్ అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు. ఇది చిత్ర దర్శకుడు రాజమౌళీ కళ అని కొనియాడారు. కళ సాకారమవడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయిందని తెలిపారు.


Tags

Next Story