Oscar 2023 : ఆర్ఆర్ఆర్ బృందానికి చంద్రబాబు అభినందనలు

Oscar 2023 : ఆర్ఆర్ఆర్ బృందానికి చంద్రబాబు అభినందనలు
X

ఆర్ఆర్ఆర్ టీంకు ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. యావత్ తెలుగువారు, భారతీయులు గర్వపడేలా ఆర్ఆర్ఆర్ టీం తమ సత్తాను చాటిందన్నారు. నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డును దక్కించుకున్నందు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భం భారతీయ సినిమా చరిత్రలో తెలుగు పాట ఉన్నత శిఖరాన్ని అందుకుందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ చిత్ర దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి, తారక్, రామ్ చరణ్, గీత రచయిత చంద్ర భోస్, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, కోరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కు అభినందనలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు.

ఆస్కార్ 2023వేడుకలో RRR చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు దక్కింది. 95వ ఆస్కార్ అవార్డులలో భాగంగా తెలుగు సినిమాకు ఆస్కార్ దక్కడంతో యావత్ భారతీయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ టీంకు రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Next Story