Oscar 2023 : ఆస్కార్ రావడం సంతోషాన్నిచ్చింది : రాహుల్ తల్లిదండ్రులు
'నాటు నాటు' సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కడం సంతోషంగా ఉందన్నారు సింగర్ రాహల్ సిప్లిగంజ్ కుటుంబసభ్యులు. మీడియాతో మాట్లాడిన రాహుల్ తల్లిదండ్రులు.. అంతర్జాతీయ వేదికపై పాడటం రాహుల్ అదృష్టమని అన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర దర్శకులు రాజమౌళీకి, సంగీత దర్శకులు కీరవాణికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాహుల్ అంతర్జాతీయ వేదికపై పాడటం సంతోషంగా ఉందన్నారు. ఇది దేవుడి దయాగా అభివర్ణించారు. రాహుల్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ రాహుల్ అంతర్జాతీయ వేదికపై పాడటం సంతోషంగా ఉందన్నారు. రాహుల్ నిజానికి ఆస్కార్ ను వరకు తాను వెళ్తానని అనుకోలేదని చెప్పారు. రాహుల్ కృషి అతన్ని అక్కడి వరకు తీసుకెళ్లిందని చెప్పారు.
గీత రచయిత పాటను రాయగా, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వరపరిచిన పాటకు సింగర్స్ రాహుల్, కాల భైరవలు స్వరాన్ని అందించారు. ఈ చిత్రాన్ని దర్శకులు రాజమౌళి తెరకెక్కించగా రామ్ చరణ్, తారక్ లు ప్రధానపాత్రలు పోషించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com