Oscar 2023 : RRR విజయం... కన్నీళ్లు పెట్టుకున్న దీపికా పదుకొణె

Oscar 2023 : RRR  విజయం... కన్నీళ్లు పెట్టుకున్న దీపికా పదుకొణె
95వ ఆస్కార్ అవార్డ్స్ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియోటర్ లో జరుగుతున్నాయి


RRR చిత్రంలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డుకు ఎంపికైంది. ఉత్తమ సాంగ్ గా అవార్డును గెలుచుకోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి తన ప్రసంగం చేస్తున్నప్పుడు దీపిక భావోద్వేగాలు కెమెరాకు చిక్కాయి.


95వ ఆస్కార్ అవార్డ్స్ కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియోటర్ లో జరుగుతున్నాయి. 'నాటునాటు' బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ ను గెలుచుకుంది. ఆస్కార్ 2023లో ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న దీపికా పదుకొణె.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన నాటు నాటు సాంగ్ ను సభకు పరిచయం చేశారు. అంతర్జాతీయ నృత్యకారులు డ్యాన్స్ చేయగా, రాహుల్, కాల భైరవలు పాడారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా కీరవాణి అవార్డును అందుకుని ప్రసంగిస్తుండగా దీపిక కన్నీళ్లు పెట్టుకున్నారు.


Tags

Read MoreRead Less
Next Story