Oscar 2023 : ఆస్కార్ అవార్డుతో తారక్... కృతజ్ఞతలు తెలిపిన రామ్ చరణ్

Oscar 2023 : ఆస్కార్ అవార్డుతో తారక్... కృతజ్ఞతలు తెలిపిన రామ్ చరణ్
ఇది మన దేశపు విజయం


ఆస్కార్ వేదికపై భారత సినీ పథాకం రెపరెపలాడిన క్షణం. 85 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఆర్ఆర్ఆర్ సువర్ణాక్షరాలతో లిఖించిన రోజు. దర్శక దిగ్గజం రాజమౌళి పర్యవేక్షణలో, సంగీత దిగ్గజం కీరవాణి మ్యూజిక్ అందించగా.. గీత రచయిత చంద్రబోస్ అక్షరాల జడిలో సింగర్స్ రాహుల్, కాల భైరవలు తమ గాణాన్ని అందించగా... రామ్ చరణ్, తారక్ లు నృత్యంతో వీక్షకులను అలరించారు. వీరందరి కష్టం ఆస్కార్ రూపంలో తెలుగు తెరను తట్టింది. దేశాన్ని గర్వించేలా చేసింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డును మీడియా ముందు ప్రదర్శించారు. అకాడెమీ అవార్డ్స్ క్లాసిక్ బ్లాక్ బంద్గా వేదికపై.. భీమ్ ఫొటోకు ఫోజులిచ్చాడు. రామ్ చరణ్ యావత్ భారత దేశానికి, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకుగాను ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

"ఆస్కార్ అవార్డును అందుకోవడం ఇప్పటికీ కలగానే ఉంది. ఆర్ఆర్ఆర్ టీంను ఆదరించిన వారందరికి ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియడం లేదు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ఎస్ఎస్ రాజమౌళిగారు, ఎమ్ఎమ్ కీరవాణి గారు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు. ప్రపంచమంతా నాటునాటు ఎమోషన్ నడుస్తుంది. గీత రచయిత చంద్రబోస్ గారు, గాయకులు రాహుల్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కు కృతజ్ఞతలు.


తారక్,.. థ్యాంక్యూ బ్రదర్
తారక్, నేను నీతో మరిన్ని సినిమాలకు డ్యాన్స్ చేసి మళ్లీ రికార్డులు సృష్టించాలనుకుంటున్నాను. మధురమైన కో-స్టార్ గా నాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ అవార్డు ప్రతీ భారతీయుడికి, సాంకేతిక నిపుణుడికి, సినిమా ప్రేక్షకుడికి చెందినది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది మన దేశపు విజయం" అని తెలిపాడు రామ్ చరణ్.

Tags

Read MoreRead Less
Next Story