Oscar 2023 : RRRటీమ్ కు ప్రశంసల వెల్లువ

Oscar 2023 : RRRటీమ్ కు ప్రశంసల వెల్లువ
X

ఆస్కార్ 2023వేడుకలో RRR చిత్రానికి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు దక్కింది. 95వ ఆస్కార్ అవార్డులలో భాగంగా తెలుగు సినిమాకు ఆస్కార్ దక్కడంతో భారతీయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ టీంకు రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

భారతీయులు గర్వపడేలా చేశారు : గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆర్ఆర్ఆర్ టీంకు అభినందనలు తెలిపారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును దక్కించుకున్నందుకు ప్రతీఒక్కరు గర్వపడుతున్నట్లు చెప్పారు. ఆర్ఆర్ఆర్ టీం భారతీయులను, తెలుగువారిని గర్వపడేలా చేశారని అన్నారు.

చిత్ర బృందానికి అభినందనలు : వెంకయ్యనాయుడు
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 'నాటునాటు' గీతం అస్కార్ అవార్డును అందుకోవడం అభినందనీయం. చిత్రబృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అని ట్వీట్ చేశారు మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.


Next Story