Oscar 2023: 'నాటు నాటు'కు ఆస్కార్ అవార్డు

RRR సినిమాకు ఆస్కార్ అవార్డు దక్కింది. నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. 95వ ఆస్కార్ అవార్డులలో భాగంగా తెలుగు సినిమాకు ఆస్కార్ దక్కడంతో సినీ యునిట్ సంతోషం వ్యక్తం చేసింది. తెలుగు చిత్రం ఆస్కార్ బరిలో నిలబడటం ఇదే మొదటిసారి. పురస్కారాన్ని అందుకోవడం కూడా మొదటిసారి కావడం గమనార్హం. నాటు నాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గీత రచయిత ఛంద్రబోస్ ఆస్కార్ ను అందుకున్నారు.
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కథానాయకులుగా నటించారు. గతేడాది రిలీజైన ఈ సినిమా కలెక్షన్ల పరంగాను విజయాన్ని అందుకుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకోగా, ఇప్పుడు ఆస్కార్ ను కూడా సాధించింది. ఆర్ఆర్ఆర్ సినిమా వివిధ కేటగిరీలలో ఆస్కార్ అవార్డుకు పోటీపడగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ ను దక్కించుకుంది. కీరవాణి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ ప్రతీ భారతీయుడికి గర్వకారణమని అన్నారు. అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com