Chiranjeevi : చిరంజీవి నెక్స్ట్ మూవీకి సంగీతం అందించనున్న ఆస్కార్ విజేత..!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన 'భోళా శంకర్' ఈ మధ్యే థియేటర్లలో రిలీజ్ అయింది. ముందు నుంచి భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఫస్ట్ రోజే చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. ఇది మేకర్స్ కు బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ ను మిగిల్చింది. బాక్సాఫీస్ వద్ద కూడా ఆక్యుపెన్సీ కార్డుల ప్యాక్ లాగా పడిపోయింది. దీంతో చిరు భారీ స్థాయిలో నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఊహించిన రేంజ్ లో బాస్ సినిమా లేదని చిత్రాన్ని చూసిన అభిమానులు కలత చెందుతున్నారు.
ఇదిలా ఉండగా ఇంతకుముందే మెగాస్టార్.. 'బింబిసార' దర్శకుడు వశిష్ట్‌తో ఒక ప్రాజెక్ట్‌ని ఓకే చేసిన సంగతి తెలిసిందే. కాగా త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారు. అయితే ఫిలిం సర్కిల్స్‌లో ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే, ఎంఎం కీరవాణి ఈ మూవీకి సంగీతం అందించనున్నారట. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ధారణ లేకపోయినా ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కూడా ఫాంటసీ డ్రామా అని, భారీ స్థాయిలో రూపొందనుందని సమాచారం. యువ దర్శకుడు వశిష్ట్.. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అప్ డేట్స్ ఇస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇక ఆగస్టు 11న రిలీజైన 'భోళా శంకర్' లో చిరు సరసన తమన్నా నటించగా.. ఆయనకు చెల్లెలిగా కీర్తి సురేష్ నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇక ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటి రోజు నైజాంలో ఈ సినిమా 4.51 కోట్ల రేంజ్‌లో షేర్’ను అందుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి నటించిన గత చిత్రాల నైజాం షేర్స్ చూద్దాం.. 'భోళా శంకర్' - రూ. 4.51 కోట్లు, 'వాల్తేరు వీరయ్య' - రూ. 6.10 కోట్లు, 'గాడ్ ఫాదర్' - రూ. 3.29 కోట్లు, 'ఆచార్య' - రూ. 7.90 కోట్లు, 'సైరా నరసింహారెడ్డి'- రూ. 8.10 కోట్లు, 'ఖైదీ నెం. 150' – రూ. 4.70 కోట్లు సాధించాయి. మొత్తంగా చూస్తే.. చిరంజీవి 'గాడ్ ఫాదర్' కంటే కాస్తా బెటర్‌గా సాధించింది. ఇక మరోవైపు చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత రెండో లోవేస్ట్ ఓపెనింగ్‌గా 'భోళా శంకర్' నిలిచింది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఎలా వసూలు చేయనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com