Oscars: ఆస్కార్ అవార్డు గెలుచుకున్న భారతీయులు..
Oscars: కాస్ట్యూమ్ డిజైనర్ భాను అతియా ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మొదటి భారతీయురాలు. ఆమె 'గాంధీ' (1982) చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా అవార్డు గెలుచుకున్నారు. సరిగ్గా పదేళ్ల తర్వాత అంటే, 1992లో, లెజెండరీ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే జీవితకాల సాఫల్య పురస్కారం కోసం ఆస్కార్ అందుకున్నారు. అలాంటి గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ చిత్రనిర్మాత ఆయనే కావడం విశేషం. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన 'లగాన్' ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లింది. కానీ అవార్డు గెలుచుకోలేకపోయింది. ఆ తర్వాత 2009లో మ్యూజిక్ మాస్ట్రో AR రెహమాన్ స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంలోని 'జై హో' పాట కోసం ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగాలలో రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నారు. ఇక 2023లో కీరవాణి యొక్క 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు రావడం తెలుగు సినిమాకు గర్వకారణం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com